Singer Saketh: హార్ట్‌లో హోల్.. వెన్నెముకకు గాయం.. సింగర్ సాకేత్ జీవితంలో ఇన్ని కష్టాలా.. ?
సింగర్ సాకేత్.. తెలుగు సంగీత ప్రియులకు పరిచయం అవసరంలేని పేరు. ఎన్నో సూపర్ హిట్ పాటలతో ఫేమస్ అయ్యాడు. అలాగే బుల్లితెరపై పలు షోలలో తనదైన కామెడీ, అల్లరితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటాడు. కానీ సినీప్రియులకు తెలిసిన సాకేత్ జీవితంలో ఊహించని విషాదం దాగుందట. తాజాగా తన గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ సింగర్స్ లో సాకేత్ ఒకరు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ పాటలతో ఫేమస్ అయ్యారు. అలాగే బుల్లితెరపై పలు సింగింగ్ షోలలో సాకేత్ చేసే అల్లరి గురించి చెప్పక్కర్లేదు. తన కామెడీతో అందర్నీ కడుపుబ్బా నవ్విస్తుంటాడు. సాకేత్ ఎక్కడ ఉంటే అక్కడ అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అంటారు. ప్రస్తుతం సినిమాలో సాంగ్స్, టీవీ షోస్, బయట ఈవెంట్స్ అంటూ పుల్ బిజీగా ఉన్నారు సాకేత్. తాజాగా ఆహా కాకమ్మ కథలు అనే షోకు అథితిగా వచ్చారు. ఈ షోలో తన కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే చిన్నప్పటి నుంచి తనకున్న ఆరోగ్య సమస్యల గురించి చెప్పుకొచ్చాడు. ఎప్పుడూ నవ్వుతూ కామెడీతో అలరించే సాకేత్ జీవితంలో ఎంతో విషాదం, బాధలు దాగి ఉన్నాయి.
సింగర్ మాట్లాడుతూ.. తాను హిమాటోమా అనే సమస్యతో పుట్టానని.. అంటే లెఫ్ట్ భుజం, తల అటాచ్ అయి పుట్టినట్లు తెలిపారు. ‘ఆ సమస్యతో పుట్టినవాళ్ల బాడీ ఒకవైపు పెరిగి ఇంకోవైపు పెరగదు. వాళ్లు 30 ఏళ్ల లోపు చనిపోతారు. ఆపరేషన్ చేసినా 70 శాతం ఛాన్స్ లేదన్నారు. కానీ ఈరోజు నేను ఇలా ఉన్నాను.. 7వ తరగతిలో ఉన్నప్పుడు గుండెలో చిన్న హోల్ వచ్చింది. ఆ ఆపరేషన్ అయింది. 5 ఏళ్ల క్రితం పెద్ద యాక్సిడెంట్ అయి వెన్నుముకకు భారీ గాయం అయ్యింది. దానికి చాలా ఖర్చయింది. ప్రస్తుతం ఇలా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే ఎప్పుడూ నవ్వించే సాకేత్ జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా అంటూ షాకవుతున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సింగర్స్ లో సాకేత్ ఉన్నారు. ఎప్పుడూ కామెడీతో సరదాగా కనిపించే సాకేత్.. అద్భుతమైన గాత్రంతో శ్రోతలను మెస్మరైజ్ చేస్తుంటారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..
Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..
Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‌తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..