Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్‌కు హరీశ్ రావు స్పెషల్ విషెస్.. రైతుబిడ్డ మొత్తం ఎంత గెలుచుకున్నాడంటే

| Edited By: Basha Shek

Dec 18, 2023 | 2:31 PM

పల్లవి ప్రశాంత్.. హిస్టరీలో నిలిచిపోయే పేరు. నార్మల్ కామన్ మ్యాన్‌లా బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి విజేతగా నిలిచాడు. టాస్కు వస్తే చాలు ప్రాణాలు కూడా లెక్కచేసేవాడు కాదు. ఇక నామినేషన్స్‌లో అయితే పుష్ప రేంజ్‌లో తగ్గేదే లే అన్నట్లు బిహేవ్ చేసేవాడు. ఆ తర్వాత మళ్లీ అందరితో కలివిడిగా ఉండేవాడు. ఎవర్నీ అగౌరవపరిచేవాడు కాదు.

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్‌కు హరీశ్ రావు స్పెషల్ విషెస్.. రైతుబిడ్డ మొత్తం ఎంత గెలుచుకున్నాడంటే
Pallavi Prashanth - Harish Rao
Follow us on

పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్ సీజన్ 7 విజేత.. గతంలో సోషల్ మీడియాలో వీడియోలు చేస్తుంటే.. బిగ్ బాస్‌కి పంపిచాలని కోరుకుంటుంటే.. అతడిని పిచ్చోడు అనుకున్నారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లడమే కాదు.. విజేతగా నిలిచాడు. ఒక రైతు బిడ్డగా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. .‘ఉల్టా-పుల్టా’ అంటూ సెప్టెంబరు 3న ప్రారంభమైన బిగ్‌బాస్‌ సీజన్‌-7 మొత్తం 105 రోజుల పాటు సాగింది. మొత్తం వైల్డ్ కార్డు ఎంట్రీలతో కలిసి 19 మంది కంటెస్టెంట్స్ లోనికి వెళ్లారు. అన్ని అడ్డంకులు చేధించుకుంటూ.. టాస్కుల్లో అసమాన ప్రదర్శన కనబరుస్తూ విజేతగా అవతరించాడు పల్లవి ప్రశాంత్. విన్నర్‌గా నిలిచిన ప్రశాంత్‌కు రూ.35లక్షల డబ్బుతో పాటు, వితారా బ్రెజా కారు, రూ.15లక్షల విలువైన డైమండ్‌ జ్యూయలరీ కూడా దక్కింది. అయితే ప్రైజ్ మనీగా వచ్చిన డబ్బుకు చాలావరకు ట్యాక్స్ కట్టవుతుంది. 15 లక్షల్లో 60 శాతం మాత్రమే అతడికి దక్కే అవకాశం ఉంది. వాస్తవానికి బిగ్‌బాస్‌ విజేతకు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ అని అనౌన్స్ చేశారు. కానీ ప్రిన్స్‌ యావర్‌ రూ.15 లక్షల సూట్‌కేసు తీసుకోవడంతో ప్రశాంత్‌కు రూ.35 లక్షలు మాత్రమే దక్కాయి.

ఇక రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. రోజుకు రూ.15 వేలు మాత్రమే ప్రశాంత్‌కు అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన 15 వారాలకు కలిపి రూ.15,75,000 అందినట్లు తెలుస్తోంది. అంటే రెమ్యూనరేషన్(రూ.15,75,000)+ ప్రైజ్‌మనీ(రూ.35 లక్షలు) మొత్తం కలిపి రూ.50 లక్షలపైనే తనకు రావాల్సి ఉంది. ట్యాక్స్‌లు అన్ని పోనూ దాదాపు రూ.25 నుంచి 27 లక్షలే అతడికి అందే అవకాశం ఉంది.

 

ప్రశాంత్‌కు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి హరీశ్ రావు…

బిగ్ బాస్ సీజన్ 7 విజేత  పల్లవి ప్రశాంత్ కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సిద్ధిపేటకు చెందిన రైతు బిడ్డ బిగ్ బాస్ 7 విజేతగా నిలువడం చాలా గర్వంగా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.  పల్లవి ప్రశాంత్.. ఈ పేరు రైతుకు ఇంటి పేరుగా మారిందని ప్రశంసలు గుప్పించారు. పొలం నుంచి బిగ్ బాస్ హౌస్ వరకు అతని ప్రయాణం ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిందన్నారు.  ప్రస్తుతం హరీశ్ రావు ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని తాజా సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.