OTT Movies : ఓటీటీలోకి సిద్ధార్థ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చిన్నా… ఎప్పుడు..? ఎక్కడ.? చూడొచ్చంటే

సిద్దార్థ్ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ చిన్న కూడా ఓటీటీలో రిలీజ్ కానుంది. సిద్ధార్థ్ ఈ సినిమాలో హీరోగా నటించడమే కాదు నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ సినిమా ఇటీవలే థియేటర్స్ లో విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అరుణ్ కుమార్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఫ్యామిలీ డ్రామా తో పాటి సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది.

OTT Movies : ఓటీటీలోకి సిద్ధార్థ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చిన్నా... ఎప్పుడు..? ఎక్కడ.? చూడొచ్చంటే
Chinna Movie

Updated on: Nov 07, 2023 | 5:21 PM

ఓటీటీ పుణ్యమా అని కొత్త సినిమాలను ఇంట్లోనే కూర్చొని ఫ్యామిలీతో కలిసి చూసే సౌలభ్యం కలుగుతోంది. కొత్త కొత్త సినిమాలో నెల రోజులకే ఓటీటీలో రిలీజే అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే చాలా సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలో అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇంకొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ఇక ఇప్పుడు సిద్దార్థ్ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ చిన్న కూడా ఓటీటీలో రిలీజ్ కానుంది. సిద్ధార్థ్ ఈ సినిమాలో హీరోగా నటించడమే కాదు నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ సినిమా ఇటీవలే థియేటర్స్ లో విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అరుణ్ కుమార్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఫ్యామిలీ డ్రామా తో పాటి సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. అన్ని ఏరియాల్లో సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీలోకి రానుంది ఈ సినిమా.

దీపావళి కానుకగా చిన్నా సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. చిన్నా సినిమాలో సిద్ధర్థ్ నటనకు విమర్శలు ప్రశంసలు దక్కాయి. సిద్ధార్థ్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అంటూ కామెంట్స్ వినిపించాయి. చిన్నా పాప కిడ్నప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పై సర్వత్రా ప్రశంసలు దక్కాయి. అంతే కాదు ఈ సినిమా కేవలం 4 కోట్ల బడ్జట్ తో తెరకెక్కించారు. 16 కోట్లకు పైగా వసూల్ చేసింది ఈ సినిమా

ఇక ఇప్పుడు ఈ సినిమాను దీపావళి సందర్భంగా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబ‌ర్ 28న‌ థియేటర్స్ లో విడుద‌లైన ఈ సినిమా తెలుగులో కొంచం గ్యాప్ తర్వాత రిలీజ్ అయ్యింది. చిన్నా సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని హాట్ స్టార్ సొంతం చేసుకుంది. దీపావళి సందర్భంగా చిన్న సినిమాను ఈనెల 11న కానీ 16న విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో చిన్నా సినిమా అందుబాటులోకి రానుంది.

సిద్ధర్థ్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.