Konda Polam : కొండపోలం నుంచి మరో అందమైన మెలోడీ ‘శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశ’..

మెగా హీరో వైష్ణవ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం కొండపోలం. ఉప్పెన సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న వైష్ణవ్ కథల విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తున్నాడు.

Konda Polam : కొండపోలం నుంచి మరో అందమైన మెలోడీ శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశ..
Kondapolam

Updated on: Sep 29, 2021 | 9:27 PM

Konda Polam : మెగా హీరో వైష్ణవ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం కొండపోలం. ఉప్పెన సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న వైష్ణవ్ కథల విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తున్నాడు. ఉప్పెన సమయంలోనే క్రిష్ దర్శకత్వంలో సినిమా చేశాడు వైష్ణవ్. కేవలం 60 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేశాడు దర్శకుడు క్రిష్. ఇక ఈ సినిమాలో అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా రిలీజ్ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఈ సినిమాను అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.. ఇటీవలే ఈ సినిమానుంచి ఓబులమ్మ అనే పాట మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘కొండ పొలం’ అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. అదే పేరును సినిమా టైటిల్ గాను ఖరారు చేశారు. ఇక కొండపొలం ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేశారు.

ఈ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలోని ”శ్వాసలో” అనే పాటను రిలీజ్ చేస్తున్నట్లు తెలుపుతూ ప్రోమోని వదిలారు. ‘శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశ..’ అంటూ సాగిన ఈ పాట విజువల్ ట్రీట్ లా అనిపిస్తుంది. ఈ సినిమా వైష్ణవ్- రకుల్ ఇద్దరూ డీ గ్లామర్ పాత్రల్లో కనిపించనున్నారు. ‘శ్వాసలో’ పాట పూర్తి లిరికల్ వీడియోని రేపు గురువారం సాయంత్రం 4. 45 గంటలకు విడుదల చేయనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pawan Kalyan : భగత్ సింగ్‌‌‌కు జోహార్లు అర్పిస్తాం.. గాంధీజీ ముందు మోకరిల్లుతాం.. మీలాంటి వాళ్లను తాటతీస్తాం : పవన్ కళ్యాణ్

AP Politics: రాజకీయ పార్టీని టెంట్‎హౌస్‎లా అద్దెకు ఇస్తున్నారు.. మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..

Rana Daggubati: మరో యంగ్ హీరోతో కలిసి మల్టీస్టారర్ మూవీ చేయనున్న దగ్గుబాటి వారబ్బాయి..