
గతేడాది సలార్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది శ్రుతిహాసన్. ఈ మూవీలో ఆద్య పాత్రలో కనిపించింది. ప్రస్తుతం సినిమాలు, షూటింగ్స్ అంటూ తెగ బిజీగా ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఖాళీ సమయం దొరికితే చాలు నెట్టింట అభిమానులతో ముచ్చటిస్తుంది. లేదంటే ఫన్నీ డాన్స్ రీల్స్, లేదా మీమ్స్ షేర్ చేస్తుంటుంది. తాజాగా ఓ ఫన్నీ మీమ్ షేర్ చేసింది శ్రుతి హాసన్. తెల్లవారుజామున మూడు గంటలకు అందరూ పడుకుంటే తాను మాత్రం రీల్స్, మీమ్స్ అన్ని తన స్నేహితురాలికి షేర్ చేస్తుంటాను అని వచ్చిన ఓ మీమ్ ను శ్రుతి హాసన్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ చేసిన పోస్ట్ వైరలవుతుండగా.. ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం శ్రుతి హాసన్ పర్సనల్ లైఫ్ గురించి నిత్యం ఏదోక వార్త నెట్టింట హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తన బాయ్ ఫ్రెండ్ శంతను హజారికతో శ్రుతి హాసన్ విడిపోయిందని.. వీరిద్దరికి బ్రేకప్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే తమ బ్రేకప్ గురించి ఇద్దరూ ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఎప్పుడూ కలిసి కనిపించే వీరు ఇప్పుడు విడి విడిగా కనిపిస్తున్నారు. ఇటీవల అభిమానులతో నెట్టింట చిట్ చాట్ చేసిన శ్రుతి హాసన్ బ్రేకప్ గురించి నేరుగా స్పందించకుండా సింగిల్ అంటూ చెప్పేసింది. ప్రస్తుతం తాను సింగిల్ అని.. ఇలాగే హ్యాపీగా ఉందని.. మింగిల్ అవ్వడానికి రెడీగా లేను అన్నట్లు తెలిపింది. దీంతో శ్రుతిహాసన్, శంతను హజారిక బ్రేకప్ రూమర్స్ పై క్లారిటీ వచ్చేసింది.
Shruti Haasan
ప్రేమలో విఫలం కావడం శ్రుతి హాసన్ కు ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ఈ బ్యూటీ లైఫ్ లో బ్రేకప్ జరిగింది. ఇక ఇప్పుడు శంతను హాజారికతోనూ బ్రేకప్ జరిగింది. దీంతో ఆ బాధ నుంచి బయటకు రావడానికే ఇలా సోషల్ మీడియాలో చాలా సమయం గడుపుతున్నట్లు కనిపిస్తుంది. రీల్స్,మీమ్స్ చూస్తూ గడిపేస్తుందని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.