Shruti Haasan: నా ఫస్ట్ క్రష్ అతనే.. ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన శ్రుతిహాసన్
ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ చిన్నది. ఈ ఏడాది శ్రుతి నటించిన సినిమాల్లో వీరసింహారెడ్డి సినిమా జనవరి 12 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అయ్యి భారీవిజయాన్ని అందుకుంది.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది శ్రుతిహాసన్. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ చిన్నది. ఈ ఏడాది శ్రుతి నటించిన సినిమాల్లో వీరసింహారెడ్డి సినిమా జనవరి 12 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అయ్యి భారీవిజయాన్ని అందుకుంది. ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది శ్రుతిహాసన్. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలోనూ హీరోయిన్ గా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సలార్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తోరూపొందుతోంది. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది ఈ బ్యూటీ. అలాగే తమిళ్ లోనూ, హిందీ భాషల్లోనూ నటించి మెప్పించింది.
ఇదిలా ఉంటే ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన బాయ్ ఫ్రెండ్ తో ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.
తన ఫస్ట్ క్రష్ ఎవరు అని అడిగిన ప్రశ్నకు ఈ అమ్మడు ఇంట్రస్టింగ్ సమాధానం చెప్పింది. తన ఫస్ట్ క్రష్ హాలీవుడ్ నటుడు బ్రుస్ లీ అని తెలిపింది శ్రుతి. ప్రస్తుతం సలార్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉంది ఈ చిన్నది.
View this post on Instagram