Shraddha Srinath: ఛాలెంజింగ్ రోల్‌కు సిద్దమైన నాని హీరోయిన్.. అలాంటి పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్

|

Dec 04, 2022 | 6:07 PM

మంచి సబ్జెక్ట్ దొరికితే ఎలాంటి పాత్రలు చేయడానికైనా రెడీ అంటున్నారు. ఇప్పుడు అలాంటి పాత్ర చేయడానికే రెడీ అవుతోంది అందాల ముద్దుగుమ్మ శ్రద్దా శ్రీనాథ్.

Shraddha Srinath: ఛాలెంజింగ్ రోల్‌కు సిద్దమైన నాని హీరోయిన్.. అలాంటి పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్
Shraddha Srinath
Follow us on

కేవలం గ్లామర్ పాత్రలే కాదు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు హీరోయిన్స్. ఈ మధ్య కాలంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ మెప్పిస్తున్నారు ముద్దుగుమ్మలు. ముఖ్యంగా ఛాలెంజింగ్ రోల్స్ వస్తే తమ టాలెంట్ మొత్తం చూపించడానికి రెడీ గా ఉన్నారు. మంచి సబ్జెక్ట్ దొరికితే ఎలాంటి పాత్రలు చేయడానికైనా రెడీ అంటున్నారు. ఇప్పుడు అలాంటి పాత్ర చేయడానికే రెడీ అవుతోంది అందాల ముద్దుగుమ్మ శ్రద్ధా శ్రీనాథ్. ఈ ముద్దుగుమ్మ 2015 కోహినూరు అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ఈ భామ. నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమా భారీ  విజయాన్ని అందుకుంది. ‘జెర్సీ’ తర్వాత ‘కృష్ణా అండ్ హిజ్ లీల’..’జోడీ’ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత సొగసరి టాలీవుడ్ లో కనిపించలేదు.

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఛాలెంజింగ్ రోల్ లో నటించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ సినిమా చేస్తుంది శ్రద్ధా శ్రీనాథ్.  ‘విట్ నెస్’ అనే టైటిల్ తో సినిమా తెరకెక్కుతోంది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ పారుశుద్య కార్మికురాలి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

కథలో బలం ఉండటంతో ఈ పాత్రలో నటించడానికి శ్రద్ధా శ్రీనాథ్ ఓకే చెప్పిందని తెలుస్తోంది. కాగా ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ మరో వార్త కూడా వైరల్ అవుతోంది. పార్తీబన్ అనే కుర్రాడు ఓ అపార్ట్ మెంట్ లో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ అనుకోకుండా చనిపోతాడు. ఆ కుర్రాడి మరణం తర్వాత.. అతని తల్లిదండ్రులు న్యాయ పోరాటానికి దిగుతారు.. ఆ పోరాటంలో ఎవరు గెలిచారు. అసలు సమాజంలో పారుశుద్య కార్మికుల పాత్ర ఎలా ఉంటుంది అన్నది ఈ సినిమాలో చూపించనున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమా శ్రద్ద కెరీర్ కు ప్లస్ అవుతుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి