Rakul Preet Singh: మరింత జాగ్రత్త కోసం పురుషులు 2 కండోమ్స్ వాడొచ్చా.. రకుల్ సమాధానం ఇదే..

Rakul Preet Singh on Condoms : 13-14 సంవత్సరాల వయస్సులో పిల్లలలో యుక్త వయస్సు ప్రారంభమవుతుంది. ఆ సమయంలోనే శృంగారానికి సంబంధించిన అవగామన అందించడం అవసరమని రకుల్ పేర్కొంది.

Rakul Preet Singh: మరింత జాగ్రత్త కోసం పురుషులు 2 కండోమ్స్ వాడొచ్చా.. రకుల్ సమాధానం ఇదే..
Rakul Preet Singh

Updated on: Feb 12, 2023 | 4:41 PM

రకుల్‌ ప్రీత్‌సింగ్‌.. ఇప్పుడు కేవలం పాటలు కోసం పెట్టుకునే గ్లామర్‌ డాల్ కాదు. స్కిన్ షోకు పరిమితమైన నటి కాదు. విభిన్నమైన రోల్స్ ఎంచుకుంటుంది. ప్రయోగాత్మక కథలకు తొలి ప్రాధాన్యం ఇస్తుంది. తాజాగా విడుదలైన సామాజిక అవగాహన చిత్రం ‘ఛత్రివాలీ’ అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. సెక్స్ ఎడ్యుకేషన్‌‌కు సంబంధించిన కండోమ్‌ టెస్టర్‌ పాత్రలో నటించి.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. శృంగారానికి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. కొన్ని అపోహలు కూడా చాలామందిని మానసికంగా కృంగదీస్తాయి. ఆ టాపిక్స్ డిస్కస్ చేయాల్సినవి అన్మది రకుల్ ఒపెనియన్. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె బోల్డ్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.

“లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు, గర్భధారణ అవ్వకుండా అదనపు భద్రత కోసం శృంగారం సమయంలో మగవాళ్లు రెండు కండోమ్‌లను ఉపయోగించవచ్చా?” అని ఇంటర్వ్యూ చేసే పర్సన్ రకుల్‌ను ప్రశ్నించారు. అందుకు ఆమె సూటిగా సమాధానం ఇచ్చింది. “ఇది అస్సలు మంచి ఆలోచన కాదు. ఎందుకంటే రెండు కండోమ్‌లు వాడటం వలన రాపిడికి గురయ్యి చిరిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ పద్దతి అస్సలు పాటించకూడదు. అంతలా రక్షణ అవసరం అని భావించినప్పుడు ఫీమేల్ కండోమ్స్ వాడొచ్చు. ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటానికి అయితే గర్భనిరోధ మాత్రలు ఎన్నో ఉన్నాయి. IUD వంటి గర్భనిరోధక పరికరాలు కూడా ఉన్నాయి” అని రకుల్ పేర్కొంది.

కాగా పునరుత్పత్తి ప్రక్రియ, మహిళల ఆరోగ్యం, సురక్షితమైన శృంగారం ప్రధాన అంశాలుగా హిందీ చిత్రం ‘ఛత్రివాలి’ తెరకెక్కింది. ఇందులో రకుల్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. జనవరి 20వ తేదీ నుంచి ఈ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి