Shivatmika: మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన హీరో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక.. కోలీవుడ్ ఎంట్రీకి రెడీ..

|

Feb 12, 2021 | 10:07 PM

టాలీవుడ్ దొరసాని కోలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. తొలి సినిమాతోనే మంచి నటిగా ఫుల్‌ మార్క్స్‌ కొట్టేసిన శివాత్మిక... కోలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు...

Shivatmika: మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన హీరో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక.. కోలీవుడ్ ఎంట్రీకి రెడీ..
Follow us on

Shivatmika:  టాలీవుడ్ దొరసాని కోలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. తొలి సినిమాతోనే మంచి నటిగా ఫుల్‌ మార్క్స్‌ కొట్టేసిన శివాత్మిక… కోలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దర్శకుడిగా ఓ స్పెషల్ ఇమేజ్‌ ఉన్న నంద పెరియాస్వామి మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. గౌతమ్‌ కార్తీక్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో చేరన్‌, జాక్వెలిన్‌ ఇంపార్టెంట్‌ రోల్స్‌లో ప్లే చేస్తున్నారు.

ఈ సినిమాలో శివాత్మిక లోకల్ టీవీ రిపోర్టర్‌గా నటిస్తున్నారు. ఆమె క్యారెక్టర్‌ గురించి క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌.. శివాత్మిక బెస్ట్ ఛాయిస్‌ అంటున్నారు. ‘ఈ క్యారెక్టర్‌కు గర్ల్‌ నెక్ట్స్ డోర్‌ అనిపించే అమ్మాయి కావాలి. శివాత్మిక లుక్‌ పర్ఫెక్ట్‌గా అలాగే ఉంటుంది. అందుకే ఆడిషన్‌ టైంలోనే ఆమెను ఓకే చేశా’మన్నారు డైరెక్టర్‌. ఫస్ట్ సినిమాలో శివాత్మిక ప్లే చేసిన క్యారెక్టర్‌కు ఇది కంప్లీట్‌ కాంట్రాస్ట్‌… దొరసానిలో సైలెంట్‌గా కనిపించిన శివాత్మిక కోలీవుడ్‌ మూవీలో బబ్లీ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు.

శివాత్మిక లుక్స్ కోలీవుడ్‌ ఆడియన్స్‌కు బాగా నచ్చుతాయంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్. చబ్బీ గర్ల్స్‌కు రెడ్‌ కార్పెట్‌ వేసే తమిళ తంబిలు ఈ తమిళ… ప్లస్‌… తెలుగమ్మాయిని అక్కున చేర్చుకుంటారన్న కాన్ఫిడెన్స్‌ తో ఉన్నారు. అన్నట్టు శివాత్మిక కీ రోల్‌లో కృష్ణవంశీ రంగమార్తాండ కూడా రిలీజ్‌కి రెడీ అవుతోంది.

Also Read:

మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్న దీపిక పదుకొనే.. మోస్ట్‌ వాల్యుబుల్‌ ఫీమేల్‌ సెలబ్రిటీగా టాప్ ప్లేస్

‘నేను ఏవి కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతానో అవే వేసుకుంటా’.. డ్రెస్సింగ్ విషయంలో అదా శర్మ కామెంట్స్