Actress Soundarya : త్వరలో తెర పైకి అందాల తార సౌందర్య జీవిత కథ.. హీరోయిన్‌గా ఆ నటి..?
అలనాటి అందాల తార, దివంగత నటి సౌందర్య జీవితకథను సినిమాగా తెరకెక్కించనున్నారనని గతంలో చాలా సార్లు వార్తలు వచ్చాయి. టాలీవుడ్ లో సౌందర్య ఎన్నో..
Actress Soundarya : అలనాటి అందాల తార, దివంగత నటి సౌందర్య జీవితకథను సినిమాగా తెరకెక్కించనున్నారనని గతంలో చాలా సార్లు వార్తలు వచ్చాయి. టాలీవుడ్ లో సౌందర్య ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. తెలుగుతోపాటు తమిళ్ లోనూ ఆమె ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. ఇక టాలీవుడ్ అగ్రహీరోలందరి సరసన సౌందర్య నటించి అలరించారు. ముఖ్యంగా వెంకటేష్ , సొందర్య జంట తెలుగు తెరపై సూపర్ హిట్ అయ్యింది.
ఇప్పటికే తెలుగులో చాలా మంది రాజకీయ, క్రీడాకారుల, సినిమా తరాల జీవిత కథలు సినిమాలు గా తెరకెక్కి అలరించాయి. ఈ క్రమంలో సౌందర్య జీవిత కథకుడా సినిమా రాబోతుందని అంటున్నారు. హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే ఆమె విమాన ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆమె మరణంతో సినీలోకం శోక సంద్రంలో మునిగిపోయారు. సౌందర్య మరణవార్త విని తెలుగు ప్రజలు తమ సొంతమనిషిని కోల్పోయినంతగా బాధపడరు. అయితే సౌందర్య జీవిత కథలో నటించే హీరోయిన్ ఈమే అంటూ.. ఇప్పుడు ఒక వార్త చక్కర్లు కొడుతుంది. సౌందర్య బయోపిక్ లో నటించే ఛాన్స్ వస్తే మాత్రం తాను వదులుకోను అంటూ.. సందర్భం వచ్చినప్పుడుల్లా ప్రస్తావిస్తోంది కన్నడ బ్యూటీ రష్మిక. సౌందర్య శ్రీదేవి బయోపిక్ లలో నటించడం తన డ్రీమ్ అని పలు సందర్భాల్లో చెప్పింది ఈ బ్యూటీ. ఆ ప్రాజెక్టుతో ఎవరు వచ్చిన ఓకే చెప్పేస్తానంటోంది. దాంతో ఇప్పుడు ఈ అమ్మడితో సౌందర్య బయోపిక్ తెరకెక్కించాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి త్వరలోనే ఈ బయోపిక్ పై ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం రష్మిక పుష్ప సినిమాస్ షూటింగ్ తో బిజీగా ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Shivatmika: మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన హీరో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక.. కోలీవుడ్ ఎంట్రీకి రెడీ..