
పై ఫొటోలో లేడీ గెటప్పులో ఉన్న టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరోను గుర్తు పట్టారా? ఇతను షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు. కెరీర్ ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టు తో పాటు విలన్ గా కూడా మెప్పించాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లోనూ హీరోగానూ ఆకట్టుకున్నాడు. టాలీవుడ్ లో ఉన్న ట్యాలెంటెడ్ నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మరో డిఫరెంట్ మూవీతో మన ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడీ హీరో. ఇందులో భాగంగా ఏకంగా లేడీ గెటప్పులో కనిపించి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. మరి ఇంతకు లేడీ గెటప్పులో ఉన్న ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా? అతను మరెవరో కాదు నరుడి బ్రతకు నటన సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన శివకుమార్ రామచంద్రవరపు. ఇప్పుడు అతను నటిస్తోన్న చిత్రం సువర్ణ టెక్స్ టైల్స్. తాజాగా ఈ సినిమా నుంచి హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ప్రశాంత్ నామిని తెరకెక్కిస్తోన్న సువర్ణ టెక్స్ టైల్స్ సినిమాలో శివకుమార్ రామచంద్రవరపుతో పాటు డిబోరా డోరిస్ ఫెల్, రాజశేఖర్ అనింగి, విక్రమాదిత్య డాంబర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఏ.వై.వి.ప్రొడక్షన్స్, సనాతన క్రియేషన్స్ బ్యానర్స్‌పై నిర్మాత అనిల్ ఈరుగుదిండ్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Here’s the First look Poster of #SuvarnaTextils 🤙🏼🥵 #HappyNewYear2026 😎
Written And Director By#PrashanthNamani ✌️
Produced By#AnilEerugudindla 🖤
Music #bharathM pic.twitter.com/jWhajIl3P3
— Mana Stars (@manastarsdotcom) January 1, 2026
నిన్నుకోరి, వకీల్ సాబ్, తొలిప్రేమ, మజిలీ వంటి చిత్రాలతో శివ కుమార్ గుర్తింపు తెచ్చుకున్నాడు. సహాయక నటుడిగానూ విలన్ గానూ మెప్పించాడు. ఇక నరుడి బ్రతకు నటన సినిమాలో హీరోగానూ ఆకట్టుకున్నాడు. ఇందులో అతని నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఈ హీరో చేతిలో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి