Don Movie: ఓటీటీలో అడుగుపెట్టనున్న స్టార్ హీరో సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

|

May 28, 2022 | 6:50 PM

తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ కుర్ర హీరో.

Don Movie: ఓటీటీలో అడుగుపెట్టనున్న స్టార్ హీరో సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
Don
Follow us on

తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Sivakarthikeyan) బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ కుర్ర హీరో. శివ కార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. ఏ యంగ్ హీరో నటించిన సినిమాలు తెలుగులోనూ రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంటాయి. గతంలో శివ కార్తికేయన్ నటించిన రెమో, వరుణ్ డాక్టర్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా డాన్(Don) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శివ కార్తికేయన్. ‘డాన్’ చిత్రం బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ తో సక్సెస్ జర్నీని కొనసాగించింది. శిబి చక్రవర్తి దర్శకత్వంలో శివకార్తికేయన్ ప్రొడక్షన్స్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన డాన్ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే వసూళ్ల పరంగాను డాన్ సినిమా సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమా ఓటీటీ లో రిలీజ్ కు రెడీ అవుతుంది.

డాన్ సినిమా త్వరలోనే ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అవుతుంది.ఈ  సినిమా విడుదలై మూడు వారాలు అవుతుంది. ఈ సందర్బంగా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డాన్ సినిమాను జూన్ 10వ తారీకున స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ శివ కార్తికేయన్  డాన్ సినిమా ను భారీ మొత్తానికి కొనుగోలు చేసిందట. నెట్ ఫ్లిక్స్ జూన్ 10 నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు ఎస్ జే సూర్య ఈ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఇక హీరోయిన్ గా క్యూట్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ నటించింది. సముద్రకని సినిమాలో మరో కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు.

NTR Jayanti 2022: ఎన్టీఆర్ జయంతికి తెలుగు జాతి కీర్తి కిరీటం అంటూ ఘన నివాళులర్పించిన మెగా బ్రదర్స్.. చిరు,పవన్‌లు
Ram Gopal Varma: ‘నన్నే మోసం చేస్తారా.. వాళ్లను వదిలే ప్రసక్తే లేదు’: రామ్ గోపాల్ వర్మ
Shamna Kasim: నాటీ లుక్స్ తో నయా ఫోజులు.. ఢీ పూర్ణ అందాలకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్

ఇవి కూడా చదవండి