Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ నుంచి అదిరిపోయే ఆప్డేట్.. ట్రైలర్ వచ్చేది అప్పుడే..

నేచురల్ స్టార్ నాని చాలా రోజుల తర్వాత శ్యామ్ సింగరాయ్ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. నాని డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో సాయి పల్లవి, కృతిశెట్టి హీరోయిన్స్ గా మెప్పించారు.

Ante Sundaraniki: 'అంటే సుందరానికి' నుంచి అదిరిపోయే ఆప్డేట్.. ట్రైలర్ వచ్చేది అప్పుడే..
Ante Sundaraniki
Follow us
Rajeev Rayala

|

Updated on: May 28, 2022 | 6:16 PM

నేచురల్ స్టార్ నాని(Nani) చాలా రోజుల తర్వాత శ్యామ్ సింగరాయ్ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. నాని డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో సాయి పల్లవి, కృతిశెట్టి హీరోయిన్స్ గా మెప్పించారు. ఈ సినిమా తర్వాత ఇప్పుడు అంటే సుందరానికి(Ante Sundaraniki) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నాని. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మలయాళీ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ  రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ను రూపొందిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్ సినిమా పై అంచనాలు పెంచేశాయి. ప్రస్తుతం ఈ చిత్రయూనిట్ స్పెషల్ ప్రమోషనల్ కంటెంట్‌తో సందడి చేస్తోంది. వివేక్ సాగర్ స్వరపరిచిన ఈ చిత్రంలోని ఫస్ట్ సింగల్ పంచెకట్టు, సెకెండ్ సింగల్ ఎంత చిత్రం, మూడో సింగిల్ రాంగో రంగ పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.

ఈ సినిమా టీజర్‌ కు భారీ స్పందన వచ్చింది. సందరం పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించి అలరించారు నాని. ఈ చిత్రంలో నాని సుందర్ అనే బ్రాహ్మణ అబ్బాయి పాత్రలో నటిస్తుండగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయి లీలాగా కనిపించనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. మే30వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రం జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి