Shekhar Kammula Coments : సారంగ దరియా సక్సెస్ ఆయనదే.. స్పందించిన చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల..

Shekhar Kammula Coments : లవ్ స్టోరీ సినిమాలోని  'సారంగ దరియా' పాట ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికి తెలుసు.. యూట్యూబ్ రికార్డ్స్ కొల్లగొట్టింది. 32 రోజుల్లో 100 మిలియన్ వ్యూస్ సాధించిన ఫస్ట్ సౌత్

Shekhar Kammula Coments : సారంగ దరియా సక్సెస్ ఆయనదే..  స్పందించిన చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల..
Shekhar Kammula Coments

Updated on: Apr 02, 2021 | 9:14 PM

Shekhar Kammula Coments : లవ్ స్టోరీ సినిమాలోని  ‘సారంగ దరియా’ పాట ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికి తెలుసు.. యూట్యూబ్ రికార్డ్స్ కొల్లగొట్టింది. 32 రోజుల్లో 100 మిలియన్ వ్యూస్ సాధించిన ఫస్ట్ సౌత్ ఇండియన్ లిరికల్ సాంగ్‌గా రికార్డ్ సెట్ చేసింది. అయితే ఈ విషయం చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందించారు.

ఈ పాట సక్సెస్ ముందుగానే ఊహించానని, కానీ ఇంత భారీ రెస్పాన్స్ ఉంటుందని అనుకోలేదన్నారు. తమ టీంలో అందరూ భావోద్వేగంతో ఉన్నారని.. ఈ సక్సెస్ క్రెడిట్ మెయిన్‌గా సుద్దాల అశోక్ తేజకు దక్కుతుందన్నారు. జానపద గీతానికి అద్భుత సాహిత్యం అందించారని, క్యాచీ లిరిక్స్ వల్లే పాట ప్రేక్షకులకు అంతగా నచ్చిందన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ పవన్‌కు తొలి సినిమానే అయినా చాలా బాగా చేశారని, తనకు బ్రైట్ ఫ్యూచర్ ఉందని తెలిపారు.

అయితే ఈ పాటపై కొన్ని రోజులుగా వివాదం నడుస్తున్న సంగతి అందరికి తెలిసిందే.. ఎంత హిట్ అయ్యిందో.. అదే స్థాయిలో వివాదాలు చుట్టుముట్టాయి. ఈ పాట సేకరణ చేసిన జానపద గాయని కోమలి సారంగ దరియాపై మీడియాకెక్కింది. అయితే చివరకు శేఖర్‌ కమ్ముల మాట్లాడటంతో సమస్య సద్దుమణిగింది. అనంతరం ఈ పాటను సినిమాలో ఉపయోగించడంపై ఇకపై తనకెలాంటి అభ్యంతరం లేదని కోమలి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీకి బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చిన శేఖర్ కమ్ముల.. ఈ పాట సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచేసిందని అభిప్రాయపడ్డారు. పాటలన్నీ హిట్ అయి మూవీని మ్యూజికల్ ‘లవ్ స్టోరి’గా మార్చేశాయని, ఏప్రిల్ 16న రిలీజ్ కానున్న చిత్రం తప్పకుండా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందన్నారు శేఖర్ కమ్ముల.

Not A Common Man Movie : విశాల్‌ -31 నాట్ ఏ కామన్ మ్యాన్.. అదరగొడుతున్న కొత్త సినిమా ప్రీ లుక్‌.. ఫిదా అవుతున్న అభిమానులు..

Superstar Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఉన్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..

Wild Dog: ఆకట్టుకుంటున్న అక్కినేని నాగార్జున సినిమా.. వైల్డ్ డాగ్ మూవీ ఎలా ఉందంటే..