
యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ నారి నారి నడుమ మురారి. తాజాగా ఈ సినిమా నుంచి హ్యుమరస్ ప్యాక్డ్ టీజర్ ను రిలీజ్ చేశారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవ్వులు, భావోద్వేగాలు, ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామా కలయికలో పర్ఫెక్ట్ ఫెస్టివల్ మూవీ. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య మహిళా కథానాయికలుగా నటించారు. మేకర్స్ తాజాగా సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు.
కథ శర్వా పాత్ర చుట్టూ తిరుగుతుంది, అతను ప్రేమలో పడతాడు, తన గర్ల్ ఫ్రెండ్ తండ్రిని వారి వివాహానికి ఒప్పిస్తాడు. అంతా సజావుగా జరుగతున్న సమయంలో, అతని మాజీ ప్రియురాలు అకస్మాత్తుగా ఆఫీస్ లోకి రావడంతో ఊహించని మలుపు తిరుగుతుంది. తరువాత జరిగే హ్యుమరస్ సంఘటనలు ఇద్దరు అమ్మాయిల మధ్య చిక్కుకున్న శర్వా పాత్ర.. వినోదాత్మక కథనం ఆకట్టుకున్నాయి. బ్లాక్ బస్టర్ ‘సామజవరగమన’ను అందించిన తర్వాత, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను రూపొందించడంలో తన ప్రతిభ నిరూపించుకున్నాడు.
నారి నారి నడుమ మురారి టీజర్ ప్రారంభం నుండి ముగింపు వరకు హ్యుమర్ తోనిండి ఉంది, ప్రేక్షకులను ఆద్యంతం అలరిస్తుంది. శర్వా పాస్ట్ – ప్రెజెంట్ లవ్ మధ్య ఇరుక్కున్న క్యారెక్టర్ లో అద్భుతమైన కామిక్ టైమింగ్‌తో మెప్పించారు. ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో ఎనర్జీతో నిండిన లుక్‌లో కనిపిస్తే, ప్రస్తుత కాలంలో క్లాస్, చార్మ్‌ను అద్భుతంగా కనబరిచారు. ప్రజెంట్ లవ్ గా సాక్షి వైద్య, మాజీ లవర్ గా సంయుక్త నటించారు. ఇద్దరూ తమ పాత్రలకు న్యాయం చేస్తూ ఆకట్టుకున్నారు. నరేష్ తనదైన స్టైల్ కామెడీతో సినిమాకు పెద్ద ప్లస్ అయ్యారు. సత్య, సునీల్, సుదర్శన్ లాంటి సహాయ నటులు హాస్యాన్ని మరింత పెంచుతూ వినోదాన్ని అందించారు. విశాల్ చంద్ర శేఖర్ అందించిన లైవ్లీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథనానికి తోడ్పడుతూ ఎంటర్‌టైన్‌మెంట్ స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది. ప్రొడక్షన్ విల్యూస్ కూడా గ్లోసీగా, గ్రాండ్‌గా ఉన్నాయి. మొత్తంగా ఈ టీజర్, యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను సమానంగా ఆకట్టుకునే ఒక పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్‌టైనర్‌కు పునాది వేసింది. హాస్యం, భావోద్వేగం, డ్రామా అన్నింటినీ సమపాళ్లలో కలిపిన సినిమాని ప్రామిస్ చేస్తోంది. ఈ సినిమా జనవరి 14వ తేదీన సాయంత్రం 5:49 గంటలకు ఫస్ట్ షోతో థియేటర్లలో విడుదలకానుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.