ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో పెళ్లిబాజాలు గట్టిగానే వినిపించాయి. మోస్ట్ ఏజిబుల్ బ్యాచిలర్ అయిన శర్వానంద్ కూడా ఈ ఏడాది పెళ్లి చేసుకొని ఫ్యామిలీ మ్యాన్ గా మారిపోయాడు. జనవరిలో ఎంగేజ్ మెంట్ చేసుకున్న శర్వా.. ఆరు నెలల తర్వాత పెళ్లి చేసుకున్నాడు. జూన్ మూడున శర్వానంద్ రక్షితా రెడ్డి వివాహం జరిగింది. జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహానికి సినిమా పెద్దలు భారీగా వచ్చారు. ప్రస్తుతం ఈ లవ్ వీ కపుల్ తమ మ్యారీడ్ లైఫ్ ను ఎంజయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు శర్వానంద్ ఫ్యామిలీ గురించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
త్వరలోనే ఈ దంపతులు తల్లిదండ్రిగా ప్రమోషన్ పొందనున్నారని టాక్ ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రస్తుతం శర్వా సతీమణి అమెరికాలో ఉన్నారు. ఆమె డెలివరీ కూడా అక్కడే జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే శర్వానంద్ కూడా అమెరికాకు వెళ్లనున్నాడట. రక్షితా రెడ్డి మెడికల్ చెకప్ తో పాటు డెలివరీ కూడా అమెరికాలోనే జరగనుందని అంటున్నారు. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం శర్వానంద్ సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చాడు. ఇటీవల కాలంలో ఆయన నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయివరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ అవి డిజాస్టర్స్ గానే నిలుస్తున్నాయి. మహానుభావుడు సినిమా తర్వాత అంతటి విజయాన్ని అందుకోలేకపోయాడు. మధ్యలో వచ్చిన ఒకే ఒక్క జీవితం సినిమా కాస్త పర్లేదు అనిపించుకుంది.
— Sharwanand (@ImSharwanand) June 11, 2023
Thank you all for the birthday wishes ❤️
Will keep trying my best to entertain you all with quality films 🤗 #Sharwa35 pic.twitter.com/NVGlpc5PVU
— Sharwanand (@ImSharwanand) March 6, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.