Sharwanand : మా బాస్ చెప్పినట్టు అతను సూపర్‌ స్టార్‌ అవుతాడు.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన శర్వానంద్..

|

Dec 07, 2021 | 5:21 PM

యంగ్ హీరో నాగ శౌర్య నటించిన లక్ష్య సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతోన్న ‘లక్ష్య’ సినిమాతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

Sharwanand : మా బాస్ చెప్పినట్టు అతను సూపర్‌ స్టార్‌ అవుతాడు.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన శర్వానంద్..
Sharwanand
Follow us on

Lakshya: యంగ్ హీరో నాగ శౌర్య నటించిన లక్ష్య సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతోన్న ‘లక్ష్య’ సినిమాతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా లక్ష్య విడుదల కాబోతోంది. ఇటీవలే ఈ సినిమా ప్రీరిలీజ్ రీవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, శర్వానంద్ హాజరయ్యారు. ఈ సందర్భముగా శర్వానంద్ మాట్లాడుతూ.. అఖండ సినిమాతో ఇండస్ట్రీకి పూర్వ వైభవం తీసుకువచ్చారు అన్నాడు. డైరెక్టర్‌ సంతోష్‌ మీ కష్టం కనపడుతోంది. సినిమా సక్సెస్‌ కావాలని కోరకుంటున్నాను అన్నారు.

ఫస్ట్‌ టైం ఆర్ట్‌ డైరెక్షన్‌ చేస్తున్న లేడీ ఆర్ట్‌ డైరెక్టర్‌కు కంగ్రాట్యులేషన్స్‌, ఆల్‌ ది వెరీ బెస్ట్‌. ప్రొడ్యూషర్స్‌ రామ్మోహన్‌రావుగారు, సునీల్‌ గారు, శరత్‌ మారార్‌ నాకు ఎంతో సన్నిహితులు. వారు నాకు పెద్దన్నల్లాగా.. ఎల్లప్పుడూ నా మంచి కోరుకునే వాళ్లు. లక్ష్య సినిమా హిట్‌ అనటంలో ఎలాంటి డౌట్‌ లేదు. ఎందుకంటే స్పోర్ట్స్‌ సినిమా చేయటానికి చాలా ధైర్యం కావాలి. చాలా స్పోర్ట్స్‌ సినిమాలు వచ్చాయి. హిట్‌ అయ్యాయి. స్పోర్ట్స్‌ సినిమా తీయాలంటే ఆ శ్రమ మొత్తం హీరోపై పడుతుంది. పాత్రకు తగ్గట్టుగా మారి నటించటానికి చాలా డెడికేషన్‌ ఉండాలి. నాగ శౌర్య డెడికేషన్‌ ఉన్న నటుడు. ట్రాన్ఫర్మేషన్‌లో కష్టం కనపడుతోంది అన్నాడు శర్వా. అలాగే ఓకే ఒక్క జీవితం, ఆడవాళ్లు తర్వాత సిక్స్‌ ప్యాక్‌ అయితేనే సినిమా చేస్తా అన్నాడు శర్వానంద్. నాగశౌర్య నాకు స్ఫూర్తి. అందరితో చక్కగా రెస్పెక్ట్‌ ఇచ్చి మాట్లాడతాడు. తనకంటూ ఓ మార్కెట్‌ తెచ్చుకున్నాడు. మా బాస్‌ చిరంజీవి చెప్పినట్లు తప్పకుండా సూపర్‌ స్టార్‌ అవుతాడు’అని అన్నాడు. ఇక  శేఖర్ కమ్ముల మాట్లాడుతూ..  ‘టీజర్, ట్రైలర్‌తో పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి అన్నారు. స్పోర్ట్స్ నేపథ్యం, ఆర్చరీ సినిమా అవ్వడంతో సగం హిట్ అయింది. సినిమాకు అందరూ కష్టపడ్డారు. కచ్చితంగా బుల్‌సై కొడతారని అనిపిస్తోంది. మంచి టేస్ట్ ఉన్న సినిమాలా కనిపిస్తోంది. నాగ శౌర్య ఫస్ట్ లుక్ నేనే విడుదల చేశాను. హార్డ్ వర్క్‌తో నాగ శౌర్య తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. కేతిక శర్మకు మంచి సక్సెస్ రావాలి. చిత్రయూనిట్‌కు కంగ్రాట్స్’ అని అన్నారు శేఖర్ కమ్ముల.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Movie: రామ్‌ ట్రైలర్‌ టీజ్‌ను విడుదల చేసిన భీమ్‌.. ఆకట్టుకుంటోన్న చెర్రీ లుక్స్‌..

Vivek Oberoi: ఇక్కడ ప్రతిభ కంటే ఇంటి పేరుకే ప్రాధాన్యం.. బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వివేక్‌ ఓబెరాయ్‌..

Samantha on Pushpa Trailer: పుష్ప ట్రైలర్ పై సమంత ఆసక్తికర ట్వీట్.. ఏమన్నదో తెలుసా..