AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shanmukh Jaswanth: ఇకపై సిరితో షణ్ముక్ ప్రేమ ప్రయాణం.. పాపం దీప్తి బ్రేకప్ చెప్పాల్సి వచ్చిందట..

దీప్తి సునయన, షణ్ముక్ జశ్వంత్ అఫిషియల్‌గా బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ క్యూట్ కపుల్ విడిపోవడంతో.. వారి ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. అయితే దీప్తి చాలా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Shanmukh Jaswanth: ఇకపై సిరితో షణ్ముక్ ప్రేమ ప్రయాణం.. పాపం దీప్తి బ్రేకప్ చెప్పాల్సి వచ్చిందట..
Shanmukh Jaswanth
Ram Naramaneni
|

Updated on: Jan 01, 2022 | 8:22 PM

Share

దీప్తి సునయన, షణ్ముక్ జశ్వంత్ అఫిషియల్‌గా బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ క్యూట్ కపుల్ విడిపోవడంతో.. వారి ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. అయితే దీప్తి చాలా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి.. మరోక అమ్మాయితో  చనువుగా ఉండటాన్ని దీప్తి సీరియస్‌గా తీసుకోలేదట. గేమ్ ప్లాన్ అయి ఉంటుంది లేదా తనలాంటి మరో అమ్మాయికి ఓదార్పు ఇచ్చాడని భావించిదట. కానీ బిగ్ బాస్ ఇంటి నుంచి వచ్చాక షణ్ముక్ వ్యవహారశైలిపై దీప్తి హర్టయిందట. హౌస్‌ నుంచి బయటకు వచ్చిన అనంతరం షణ్ముక్ కనీసం దీప్తిని కలిసే ప్రయత్నం చేయలేదట. బయట నుంచి దీప్తి.. షణ్ముక్‌కు చాలా సపోర్ట్ చేసింది. అంతకుముందు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న నేపథ్యంలో.. తన అనుభవాన్ని క్లియర్‌గా చెప్పి.. ఇలాంటి తప్పులు చేయొద్దని షణ్ముక్‌కు వెళ్లేప్పుడు సూచించిదట.  షణ్ణు బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లినప్పటి నుంచి.. అక్కడ వేసుకునే డ్రసెస్ అన్నీ దీప్తినే పంపింది. బయట నుంచి షణ్ణు ఫ్యాన్స్‌ను కూడా ఏకం చేసింది. అతడికి ఓటింగ్ పడేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. ఇంత చేస్తే… షణ్ముక్ రన్నరప్‌గా బయటకు వచ్చిన తర్వాత కనీసం దీప్తిని కలవలేదు. ఆమెతో మాట్లేడేందుకు ప్రయత్నం చేయలేదు. లోపల ఏ పరిస్థితుల్లో అలా బిహేవ్ చేశానో.. చెప్పే ప్రయత్నం కూడా చేయలేదట షణ్ముక్. అతడి నుంచి పిలుపు వస్తుందని భావించిన దీప్తికి.. నిరాశే ఎదురైంది. దీంతో ఆమె బ్రేకప్ చెప్పాల్సి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

కాగా షణ్ముక్ ఇకపై తన ప్రయాణాన్ని సిరితో కొనసాగించాలని డిసైడయినట్లు సమాచారం. అందుకే అతడు దీప్తిని దూరం పెట్టాడని చెబుతున్నారు.  సిరి, ఆమె ప్రియుడు శ్రీహాన్‌ మధ్య కూడా గ్యాప్ వచ్చిందని తెలుస్తోంది. సో.. ఇకపై సిరి… షణ్ముక్‌తో ట్రావెల్ అయ్యేందుకు కూడా ప్రాబ్లం లేదు. కాగా యూట్యూబర్‌గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న షణ్ముక్ ఇలా ఎందుకు చేశాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌‌గా మారింది. బిగ్ బాస్ ఇంట్లో వెళ్లిన షణ్ముక్‌ 100 రోజులకు పైగానే ప్రేమించిన దీప్తికి దూరంగా ఉన్నాడు. ఫినాలే తర్వాత తను.. మాములుగా అయితే పేరెంట్స్‌‌ను, ప్రేయసి దీప్తిని కలవాలి. పేరెంట్స్ ఎలాగూ ఫినాలే ఎఫిసోడ్‌కు వచ్చారు కాబట్టి.. దీప్తిని కలిసి.. ఆమెతో తన మనసులోని భావాలు షేర్ చేసుకోవాలి. కానీ సీదా వైజాగ్ వెళ్లిపోయాడు షణ్ణు. ఇక హృదయం ముక్కలవ్వకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఆ బాధలోనూ కొన్నాళ్లు వెయిట్ చేసిన దీప్తి.. ఫైన‌ల్‌గా కొత్త సంవత్సరం రోజున షణ్ణు, తాను ఇకపై కలిసి ఉండలేమని స్పష్టం చేస్తూ పోస్ట్ పెట్టింది.

Also Read: East Godavari: నదిలో దూకిన లేడీ వాలంటీర్‌.. పరుగుపరుగన వచ్చి ఆమె కాపాడిన కౌన్సిలర్.. కానీ

Viral: సంచలనం.. ‘ప్లాస్టిక్‌ బిడ్డ’కి జన్మనిచ్చిన మహిళ.. ఇండియాలోనే