AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan Shankar Movie: శంకర్‌, రామ్‌ చరణ్‌ చిత్రంలో నటించేది ఆ హీరోయినేనా..? చెర్రీతో మరోసారి జతకట్టనున్న..

Ram Charan Shankar Movie: రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ భారీ చిత్రానికి సన్నాహాలు జరుగుతోన్న విషయం తెలిసిందే. నిజానికి కమల్‌ హాసన్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'ఇండియన్‌-2' చిత్రానికి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా.

Ram Charan Shankar Movie: శంకర్‌, రామ్‌ చరణ్‌ చిత్రంలో నటించేది ఆ హీరోయినేనా..? చెర్రీతో మరోసారి జతకట్టనున్న..
Narender Vaitla
| Edited By: Team Veegam|

Updated on: Mar 05, 2021 | 4:04 PM

Share

Ram Charan Shankar Movie: రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ భారీ చిత్రానికి సన్నాహాలు జరుగుతోన్న విషయం తెలిసిందే. నిజానికి కమల్‌ హాసన్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఇండియన్‌-2’ చిత్రానికి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ చాలా రోజులు వాయిదా పడడం.. ప్రస్తుతం కమల్‌ రాజకీయాల్లో బిజీగా ఉండడం.. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు నుంచి డీవోపీ రత్నవేలు కూడా తప్పుకోవడం.. ఇలా కారణాలు ఏమైనా ఈ సినిమాలో మధ్యలోనే ఆగిపోయింది.

ఇదిలా ఉంటే ‘ఇండియన్‌-2’ ఆగిపోవడంతో శంకర్‌ మరో చిత్రాన్ని మొదలుపెట్టడానికి సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌తో కలిసి ఓ భారీ మల్టీస్టారర్‌ మూవీకి తెరతీశాడు. ఈ విషయాన్ని శంకర్‌ అధికారికంగా ప్రకటించగానే మెగా అభిమానుల్లో ఒక్కసారిగా జోష్‌ పెరిగింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తోందనేది సదరు వార్త సారంశం. రకుల్‌ ‘ఇండియన్‌-2’ సినిమా కోసం తన కాల్షీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా ఆగిపోవడంతో.. రకుల్‌ కేటాయించిన డేట్లను ఈ కొత్త చిత్రం కోసం ఉపయోగించుకోవాలని శంకర్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే రకుల్‌ ప్రీత్‌ సింగ్ గతంలో చెర్రీ హీరోగా నటించిన ‘ధృవ’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. మరి రకుల్‌ మరోసారి చెర్రీతో జతకట్టునుందా చూడాలి.

Also Read: Varalaxmi Sarathkumar: ‘జయమ్మ’ గురించి మీకు ఈ విషయాలు తెలుసా..? వరలక్ష్మి బర్త్‌డే స్పెషల్‌ స్టోరీపై ఓ లుక్కేయండి..

A1 Express Movie Twitter Review : ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏ1 ఎక్స్‌‌‌‌ప్రెస్.. హాకీ ఆటగాడిగా ఆకట్టుకున్న సందీప్ కిషన్

Nenjam Marappathillai : నాలుగేళ్లుగా నలుగుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది..