Hyderabad City Police : ప్రజల్లో అవగాహన కోసం బ్రహ్మనందాన్ని ఫుల్‌గా వాడేసుకున్న హైదరాబాద్ పోలీసులు
ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందం బ్రహ్మానందం.. ఈ పేరు గుర్తుకు రాగానే ఆటోమేటిక్ గానే మన పెదవులపై చిరునవ్వు వస్తుంది. బ్రహ్మీ గత కొంతకాలంగా తక్కువ సినిమాల్లో కనిపిస్తున్నారు. అయితే మీమ్స్ రూపంలో..
Hyderabad City Police : ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందం బ్రహ్మానందం.. ఈ పేరు గుర్తుకు రాగానే ఆటోమేటిక్ గానే మన పెదవులపై చిరునవ్వు వస్తుంది. బ్రహ్మీ గత కొంతకాలంగా తక్కువ సినిమాల్లో కనిపిస్తున్నారు. అయితే మీమ్స్ రూపంలో ఎప్పుడూ సందడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న బ్రహ్మానందాన్ని ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఇక మీమ్స్ అంటూ.. కనిబడితే వాటితో ఇలాగే చేస్తాం అని చెప్పేశారు. అసలు బ్రహ్మానందాన్ని పట్టుకోవడం ఏంటి..? ఈ మీమ్స్ కథ ఏమిటంటే..?
సమాజంలో జరిగే మోసాల గురించి.. పోలీసులు అవగాహన కల్పించడం కామన్.. కాని ఆ అవగాహనను కొంచెం ఎంటర్‌టైన్ జోనర్లో కల్పిస్తే..! అన్న థాట్.. ఇప్పుడు హైదరాబాద్ పోలీసులకు వచ్చింది. అలా రావడమే ఆలస్యం.. సోషల్ మీడియాలో దుమ్ముదులుపుతున్న బ్రహ్మీ మీమ్స్ అన్నింటిని కలిపి.. ఓ అవేర్‌నెస్ వీడియోను రూపొంచారు.. హైదరాబాద్ పోలీసులు. జాబ్ పేరుతో ఆన్‌లైన్‌లో మోసపోవద్దు.. అనే కాన్సెప్ట్ తో బ్రహ్మీ టాప్ మోస్ట్ మీమ్స్‌ను అన్నింటినీ వాడి మరీ.. ఓ ఫన్నీ అవేర్‌నెస్ వీడియోను హైదరాబాద్ పోలీసులు రెడీ చేశారు. ఆ వీడియో పోలీస్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్‌లో.. పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియో ఇప్పుడు అందరినీ ఎంటర్టైన్ చేస్తూ.. ఆలోచింప చేస్తూ.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
హైదరాబాద్ పోలీసుల ట్విట్టర్ అకౌంట్ :
Beware Of Fraud Jobs pic.twitter.com/45c11YmqcA
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) March 3, 2021
Also Read: