
సినీ నటి షకీలా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు షకీలా. శృంగార భరిత పాత్రలతో షకీలా పాపులర్ అయ్యారు. ఎన్నో సినిమాల్లో విలక్షణ పాత్రల్లో నటించారు షకీలా. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న షకీలా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. ఆ మధ్య బిగ్ బాస్ షో లోనూ పాల్గొన్నారు షకీలా. గతంలో షకీలా ఓ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను వెల్లడించారు. మలయాళ చిత్రసీమలో తన కెరీర్ శిఖరాగ్రంలో ఉన్నప్పుడు, అధిక కలెక్షన్లతో తాను సూపర్ స్టార్‌గా మారినప్పుడు తోటి నటీనటుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. అలాగే ఆ సమయంలో తనతో స్నేహం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని, అందరూ భయపడ్డారని ఆమె పేర్కొన్నారు.
షూటింగ్ సెట్స్‌లో తనను ఇతరుల నుంచి దూరం చేసి ప్రత్యేక గదిని కేటాయించారని షకీలా అన్నారు. ఈ వివక్షకు విసిగిపోయి, సొంత ఖర్చులతో 20కి పైగా క్యారవాన్‌లను కొనుగోలు చేసి, వాటిలోనే ఉండటం, ప్రయాణించడం చేసేదానినని తెలిపారు షకీలా. అదేవిధంగా తన 25 ఏళ్ల కెరీర్‌లో ఒక్క అవార్డు ఫంక్షన్‌కు కూడా ఎవరూ ఆహ్వానించలేదని ఎమోషనల్ అయ్యారు. అలాగే సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ.. మంచి వ్యక్తులకు సరైన అవకాశాలు రావని, టాలెంటెడ్ తెలుగు, తమిళ అమ్మాయిలు ఉండగా, బాంబే నుంచి హీరోయిన్లను తీసుకువచ్చి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారని ఆమె అన్నారు. నెల్లూరు, విజయవాడ వంటి ప్రాంతాల్లో ఎంతోమంది ప్రతిభావంతులైన తెలుగు అమ్మాయిలు ఉన్నారని, వారికి అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అలాగే తన కుటుంబం, తల్లి, తోబుట్టువుల భవిష్యత్తు తనకు అత్యంత ముఖ్యమని, బయటి ప్రపంచం తన గురించి ఏమనుకున్నా పట్టించుకోలేదని స్పష్టం చేశారు. క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ, తనకెప్పుడూ అలాంటి అనుభవం ఎదురు కాలేదని, ఒకవేళ ఎవరైనా అడిగి ఉంటే కొట్టేదానినని లేదా, నచ్చితే ఆలోచించేదానినని సరదాగా చెప్పారు. క్యాస్టింగ్ కౌచ్ బాధితులకు మద్దతుగా నిలుస్తానని ఆమె స్పష్టం చేశారు.. షకీలా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.