బిగ్ బాస్ హౌస్ లో అప్పుడే గందరగోళం మొదలైంది. తొలి రోజు ఎంట్రీలతో సందడి చేసిన పాటిస్పెట్స్ రెండో రోజు నుంచే ఏడుపులు, గొడవలు మొదలు పెట్టేశారు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన 14 మందిలో ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉన్నారు. శోభా శెట్టి, రతిక, ప్రిన్స్ యావర్, ప్రశాంత్, కిరణ్ రాథోడ్, గౌతమ్, షకీలా, దామిని ఈ నామినేషన్స్‌లో మరివీరిలో ఈ వారం ఎవరు బయటకు రానున్నారన్నది తెలియాల్సి ఉంది. ఇక మొదటి రోజు నుంచే హౌస్ లో రచ్చ మొదలైంది. నామినేషన్స్ విషయంలో శోభా శెట్టి చేసిన హంగామా అంత ఇంత కాదు. నామినేష్ నామినేషన్ కు చెప్పిన రీజన్ చెత్త రీజన్ కాగా.. గౌతమ్ కృష్ణ తో వాగ్వాదానికి కూడా దిగింది.
గౌతమ్ మేడం అంటూ మర్యాద ఇచ్చిన కూడా అమ్మడి సీరియస్ అయ్యి సీన్ చేసింది. ఇక హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినవారిలో యూట్యూబర్ టేస్టీ తేజ హౌస్ లో అందరితో కలిసిపోయాడు, సరదాగా మాట్లాడుతూ సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే శివాజీని పెద్దాయన అంటే.. ఎద్దులా ఉన్నావ్ ఎవడ్రా పెద్దాయన అని అన్నా కూడా దాన్ని లైట్ గా తీసుకున్నాడు. ఆతర్వాత బ్రో అని పిలిస్తే ఎవడ్రా నీకు బ్రో అంటూ కామెంట్స్ చేశాడు. కానీ తేజ వాటిని పట్టించుకోలేదు.
ఇక హౌస్ లో అక్కడి విషయాలు ఇక్కడ ఇక్కడి విషయాలు అక్కడ చెప్తూ గొడవలు మాత్రం పెడుతున్నాడు. ఇదిలా ఉంటే నిన్నటి ఎపిసోడ్ లో నటి షకీలా దగ్గరకు వెళ్లి ముచ్చట్లు పెట్టాడు. ఈ క్రమంలోనే ఆమెను మీరు అడల్ట్ సినిమాలు ఎందుకు చేశారు.? అని ప్రశ్నించాడు. దానికి ఆమె నాకు ఆ సమయంలో ఎక్కువగా అలాంటి సినిమా చాన్సులే వచ్చాయి అని తెలిపారు. మీ ఇంట్లో వారు ఏవమానలేదా..? అని ప్రశ్నించాడు. దానికి షకీలా స్పందిస్తూ.. నేను చేసిన సినిమాలకు డబ్బులు బాగానే వచ్చాయి. దాంతో నా ఇంట్లో వారు కూడా నన్ను ఏమనలేదు అని చెప్పింది. వెంటనే మీరు అడల్ట్ సినిమాలు ఎన్ని చేశారు అంటూ మరో ప్రశ్న వేశాడు. సుమారు 500లకు పైగా అలాంటి సినిమాలే చేశాను .. కెరీర్ బిగినింగ్ లో మంచి పాత్రలే చేశాను.. ఆతర్వాత అన్ని అలాంటి అవకాశాలే వచ్చాయి. నిక్కర్లు వేసుకొని గ్లామర్ షో చేస్తూ.. డాన్స్ లు చేస్తే తప్పులేనప్పుడు.. అలాంటి సినిమాలు చేయడం లోనూ తప్పు లేదు అని తెలిపింది. అయినా ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావ్ నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావా అని షకీలా ప్రశ్నించడంతో తేజ ఆ టాపిక్ ను వదిలేశాడు.
The moment you’ve been waiting for has arrived! 🕒🗳️ Voting lines are now open! Cast your vote and support your favorite contestant. Make your voice count! 🔊💫 #VoteNow #BiggBossTelugu7 #StarMaa @iamnagarjuna @DisneyPlusHSTel pic.twitter.com/aRQy1AQqkk
— Starmaa (@StarMaa) September 5, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..