Jawan: రిలీజ్‌కు ముందే రికార్డ్ క్రియేట్ చేసిన జవాన్.. బాలీవుడ్ చరిత్రలోనే తొలి సినిమాగా

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన పఠాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు భారీగా కలెక్షన్స్ ను కూడా రాబట్టింది. బాలీవుడ్ సినిమాల రికార్డ్ ను పఠాన్ సినిమాతిరగరాసింది. ఇక ఇప్పుడు షారుఖ్ నటిస్తున్న సినిమా జవాన్. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరికొద్ది గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను విడుదలైన పోస్టర్స్ దగ్గర నుంచి ట్రైలర్ వరకు సినిమా పై అంచనాల ను భారీ గా పెంచేశాయి. పఠాన్ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుందని అంటున్నారు ఫ్యాన్స్.

Jawan: రిలీజ్‌కు ముందే రికార్డ్ క్రియేట్ చేసిన జవాన్.. బాలీవుడ్ చరిత్రలోనే తొలి సినిమాగా
Jawan Movie

Updated on: Sep 06, 2023 | 11:50 AM

వరస ఫ్లాప్ లతో సతమతం అయిన షారుఖాన్ పఠాన్ సినిమాతో సంచలన హిట్ ను అందుకున్నారు. పఠాన్ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన పఠాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు భారీగా కలెక్షన్స్ ను కూడా రాబట్టింది. బాలీవుడ్ సినిమాల రికార్డ్ ను పఠాన్ సినిమాతిరగరాసింది. ఇక ఇప్పుడు షారుఖ్ నటిస్తున్న సినిమా జవాన్. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరికొద్ది గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను విడుదలైన పోస్టర్స్ దగ్గర నుంచి ట్రైలర్ వరకు సినిమా పై అంచనాల ను భారీ గా పెంచేశాయి. పఠాన్ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుందని అంటున్నారు ఫ్యాన్స్.

అట్లీ సినిమాలు ఎంత పెద్ద విజయాల్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లో ఆయన తెరకెక్కించిన రాజా రాణి, తేరి (తెలుగులో పోలీసోడు), మెర్సల్‌ ( తెలుగులో అదిరింది), బిగిల్‌ ( తెలుగులోవిజిల్‌) భారీ విజయాలను అందుకున్నాయి. వీటిలో మూడు సినిమాలో దళపతి విజయ్ తోనే చేశారు అట్లీ. ఇక ఇప్పుడు జవాన్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జవాన్ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక పఠాన్ సినిమా రిలీజ్క్ కు ముందే ఓ రికార్డ్ ను క్రియేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో జవాన్ సినిమా సరికొత్త రికార్డ్ ను నెలకొలిపింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయని తెలుస్తోంది.

ఈ మూవీ బుకింగ్స్ ఓపెన్ అవవగానే కొన్ని గంటల్లోనే 8 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. మొత్తంగా ఇప్పటివరకు 10లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయని టాక్.  తక్కువ టైం లో ఈ రేంజ్ తో టికెట్స్ అమ్ముడవ్వడం బాలీవుడ్ లోనే తొలిసారి కావడం విశేషం. మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎంత పెద్ద హిట్ అవుతుందో.. ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..