Bollywood : స్టార్ హీరోలకు షాక్ ఇచ్చిన సర్కార్.. షారూఖ్, అక్షయ్, అజయ్‌లకు నోటీసులు

పాన్ మసాలా ప్రకటనల వల్ల ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీలకు పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. పాన్ మసాలా ప్రకటన వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పాన్ మసాలా ప్రకటనల కేసులో షారూఖ్, అజయ్, అక్షయ్ కుమార్‌లకు నోటీసులు జారీ చేసినట్లు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌కు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Bollywood : స్టార్ హీరోలకు షాక్ ఇచ్చిన సర్కార్.. షారూఖ్, అక్షయ్, అజయ్‌లకు నోటీసులు
Bollywood

Updated on: Dec 10, 2023 | 12:24 PM

బాలీవుడ్ స్టార్ హీరోలు షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ , అజయ్ దేవగన్‌లకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ ముగ్గురు హీరోలకు సర్కారు నోటీసులు జారీ చేసింది. పాన్ మసాలా ప్రకటనల వల్ల ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీలకు పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. పాన్ మసాలా ప్రకటన వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పాన్ మసాలా ప్రకటనల కేసులో షారూఖ్, అజయ్, అక్షయ్ కుమార్‌లకు నోటీసులు జారీ చేసినట్లు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌కు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఈ విషయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

పాన్ మసాలా ప్రకటనల కేసులో కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదన ప్రకారం, సుప్రీంకోర్టు కూడా ఈ అంశంపై విచారణ చేపట్టింది. దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసేందుకు తదుపరి విచారణ తేదీని నిర్ణయించారు. ఈ విషయంలో తదుపరి విచారణ మే 9, 2024న జరగనుంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ రాజేష్ సింగ్ చౌహాన్ ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.

పాన్ మసాలా వాణిజ్య ప్రకటనలలో నటించిన షారుఖ్, అక్షయ్,అజయ్ దేవగన్‌లను కూడా పద్మ అవార్డుతో సత్కరించారు. అదే సమయంలో నటీనటులు ఇలాంటి ప్రకటనల్లో నటించడం పై పిటిషన్ దాఖలు చేసిన లాయర్ మోతీలాల్ యాదవ్ మాట్లాడుతూ.. సెలబ్రిటీలు ఇలా చేయడం వల్ల ప్రజలు కూడా దాన్ని అనుసరిస్తారని అన్నారు. ఇప్పుడు ఈ విషయంలో ఏం జరుగుతుందనే దానిపై అందరి దృష్టి పడింది.

షారుఖ్ ఖాన్ ఈ ఏడాది బాలీవుడ్‌కి రెండు హిట్ సినిమాలను అందించాడు. కింగ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ ఈఏడాది ప్రారంభంలో విడుదలైంది అలాగే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కొత్త రికార్డులను సృష్టించింది. ‘పఠాన్’ సినిమా తర్వాత షారుక్ ఖాన్ ‘జవాన్’ సినిమా తో ప్రేక్షకులను అలరించాడు. ‘జవాన్’ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ‘డంకీ’ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు కింగ్ ఖాన్. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది.  ‘డంకీ’ సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.