Bhanupriya : వాళ్లు చెప్పింది ఒకటి తీసింది మరొకటి.. ఇష్టం లేక చేసిన సినిమా అదే.. భానుప్రియ కామెంట్స్..

ఒకప్పుడు తెలుగు సినీరంగంలో డిమాండ్ ఉన్న హీరోయిన్ భానుప్రియ. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఆ తర్వాత సహయ నటిగా అలరించింది. కానీ ఇప్పుడు ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది. దశాబ్దాలపాటు సినీప్రయాణంలో తనకు ఇష్టం లేకుండా చేసిన ఒక సినిమా గురించి వెల్లడించారు. కథ చెప్పినప్పుడు పాత్రకు మంచి ప్రాధాన్యం ఉందని తెలిపినా, షూటింగ్ సమయంలో అది లేదని అన్నారు.

Bhanupriya : వాళ్లు చెప్పింది ఒకటి తీసింది మరొకటి.. ఇష్టం లేక చేసిన సినిమా అదే.. భానుప్రియ కామెంట్స్..
Bhanupriya

Updated on: Jan 20, 2026 | 2:01 PM

నటి భానుప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమలో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్ ఆమె. సౌత్ స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించిన ఆమె.. కాలక్రమేణా వయసు తగిన పాత్రలు చేసి మెప్పించింది. యంగ్ హీరోలకు తల్లిగా, అత్తగా కనిపించింది. ఆ తర్వాత అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యింది. ప్రస్తుతం ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అయితే తన నటనా జీవితంలో ఇష్టం లేకుండా చేసిన ఒక సినిమా అనుభవాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఒక చిత్రంలో తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని చెప్పినప్పటికీ, చివరికి అది లేదని షూటింగ్‌లో తెలిసిందని ఆమె వెల్లడించారు. సినిమాకు అంగీకరించే ముందు, తనకు మంచి పాత్ర, కథలో ప్రాధాన్యత ఉంటుందని చిత్ర బృందం హామీ ఇచ్చిందని భానుప్రియ తెలిపారు. కూతుర్ని ప్రోత్సహించే డాన్సర్ పాత్ర అని, ఎంతో ప్రాధాన్యత ఉంటుందని చెప్పడంతో ఆమె ఒప్పుకున్నానని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Serial Actress : ఒడియమ్మ బంటీ.. త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా.. ?

కానీ చిత్రీకరణ జరిగే సమయంలో, చెప్పినంత ప్రాముఖ్యత తన పాత్రకు లేదని ఆమె గ్రహించానని అన్నారు. ఆ సమయంలో దాన్ని ప్రశ్నించడం కుదరలేదని, ఎలాంటి వివాదాలు లేకుండా ఉండాలనుకున్నానని ఆమె పేర్కొన్నారు. ఆ సినిమా పేరు నాట్యం అని, అది డ్యాన్స్ ఆధారిత చిత్రం అని తనకు తెలుసని, అయినప్పటికీ తన పాత్రకు నృత్యంలో కూడా పెద్దగా ప్రాధాన్యత లభించలేదని భానుప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. మొదట చెప్పిన విధంగా పాత్రకు ప్రాధాన్యత లేకపోవడం తనను నిరాశపరిచిందని ఆమె అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఒకప్పుడు తోపు హీరోయిన్.. చిరంజీవితో ఎక్కువ సినిమాలు.. 3 పెళ్లిళ్లు.. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ..

1984లో సితార చిత్రంతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన భానుప్రియ, ఆ తర్వాత పదేళ్ళపాటు ఎంతో బిజీగా ఉన్నానని, తర్వాత సెలెక్టివ్‌గా సినిమాలు చేయడం మొదలుపెట్టానని అన్నారు. హీరోయిన్‌గా ఉన్నప్పుడు కూడా మంచి ప్రొడక్షన్, మంచి కథలు ఉన్న చిత్రాలనే ఎంచుకొని చేశానని, కమర్షియల్ చిత్రాల్లో కూడా నటించానని వివరించారు. పెద్ద హీరోల పక్కన అవకాశాలు వచ్చి వదులుకున్నవి ఏమీ లేవని ఆమె తెలిపారు. చిరంజీవి తనతో పాటు రాధ డాన్స్ చేయడం ఒక ఛాలెంజ్ అని చెప్పేవారని, ఆయన మంచి డాన్సర్ కాబట్టి ఆయనతో కలిసి డాన్స్ చేయడం తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. చిరంజీవితో డాన్స్ చేయడం ఛాలెంజ్ లా కాకుండా ఉత్సాహంగా ఉండేదని, సెట్స్‌లో తాము ఇద్దరం చాలా ఉషారుగా పెర్ఫార్మ్ చేసేవాళ్ళమని ఆమె గుర్తుచేసుకున్నారు. ఎలాంటి క్లిష్టమైన స్టెప్స్‌నైనా చిరంజీవి ఎంతో సులభంగా చేసేవారని, ఆయన ఎప్పుడూ సరదాగా మాట్లాడుతా ఉండేవారని, తన నటనకు, డాన్స్‌కు కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చేవారని భానుప్రియ అన్నారు.
ఎక్కువమంది చదివినవి : Anantha Sriram: యూత్‏కు పిచ్చేక్కించేసిన పాట.. ఆ సాంగ్‏తో నా జీవితమే మారిపోయింది.. రచయిత అనంత్ శ్రీరామ్..