పవన్ కళ్యాణ్ కోసం లారీలో జనాలు వచ్చేవారు.. ఆమె వల్లే ఆ సినిమాలో ఛాన్స్ వచ్చిందని రాశి

సీనియర్ హీరోయిన్ రాశి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.. బాలనటిగా తెరంగేట్రం చేసి ఆ తర్వాత కథానాయికగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. పవన్ కళ్యాణ్ సరసన గోకులంలో సీత, జగపతి బాబు జోడిగా శుభాకాంక్షలు, పెళ్లి పందిరి, స్నేహితులు, ప్రేయసి రావే వంటి హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేసింది.

పవన్ కళ్యాణ్ కోసం లారీలో జనాలు వచ్చేవారు.. ఆమె వల్లే ఆ సినిమాలో ఛాన్స్ వచ్చిందని రాశి
Actress Rashi

Updated on: Jan 28, 2026 | 1:12 PM

ఒకప్పుడు తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్స్ లో రాశి ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు రాశి.. అప్పట్లో ఆమె అందానికి, నటనకు కుర్రకారు ఫిదా అయ్యారు. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోయిన ఆమె.. పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చిన ఆమె.. సీరియల్స్, సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాశి వయసు 45 సంవత్సరాలు. ప్రస్తుతం సీరియల్స్ తో పాటు సినిమాల్లోనూ బిజీగా ఉన్న రాశి ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాశి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

రాశి మాట్లాడుతూ.., పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తన మొదటి సినిమా గోకులంలో సీత అనుభవాలుపంచుకున్నారు. గోకులంలో సీత సినిమాలో ఛాన్స్ రావడానికి కారణం చిరంజీవి సతీమణి సురేఖ అని తెలిపారు రాశి. శుభాకాంక్షలు సినిమాలో రాశి నటన చూసి సురేఖ గారు ఆమెను ఇంటికి పిలిపించారని తెలిపారు రాశి. దాంతో నేను చిరంజీవి గారి కోసం అనుకుని, తన ఆల్బమ్ తో వెళ్ళానని, అక్కడ చిరంజీవి గారు తన ఆల్బమ్ చూసి ఒక ఫోటోషూట్ చేయిస్తానని చెప్పారని రాశి తెలిపారు. ఆతర్వాత సురేఖ గారు పవన్ కళ్యాణ్ రెండో చిత్రం గోకులంలో సీత కోసం ఒక మంచి నటి కావాలని రాశిని ఎంపిక చేశారని తెలిపారు రాశి.

శుభాకాంక్షలులోని ఆనందమానందమాయే, గుండె నిండా గుడి గంటలు పాటల్లో తన నటన సురేఖ గారికి ఎంతగానో నచ్చిందని తెలిపారు రాశీ. పవన్ కళ్యాణ్ కు అప్పటికే అద్భుతమైన క్రేజ్ ఉండేదని, సినిమా ప్రారంభోత్సవాలకు ప్రజలు లారీల మీద వచ్చేవారని రాశి గుర్తుచేసుకున్నారు. అయితే, గోకులంలో సీత షూటింగ్ చాలా సైలెంట్ గా , తక్కువ మంది యూనిట్ సభ్యులతో జరిగిందని, బోయపాటి శ్రీను వంటి వారు అప్పుడు అసోసియేట్స్ గా పని చేశారని అన్నారు రాశి గుర్తు చేసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ షూటింగ్ సమయంలో చాలా రిజర్వ్ డ్ గా, కేవలం గుడ్ మార్నింగ్, బాయ్ అని మాత్రమే పలకరించేవారని తెలిపారు. చాలా సంవత్సరాల తరువాత, రాశి తన కుమార్తె మొదటి పుట్టినరోజుకు ఆహ్వానించడానికి పవన్ ను కలిశానని.. దాదాపు 15-20 నిమిషాల పాటు గోకులంలో సీత, పాటలు, తన నాట్యం, తన కుటుంబం గురించి పవన్ కళ్యాణ్ తో మాట్లాడారని, మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి తనను కారు వరకు పంపించారని రాశి గుర్తుచేసుకున్నారు రాశి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..