Pavala Syamala: కడుపుబ్బా నవ్వించిన పావలా శ్యామల కన్నీటి గాథ.. సాయం కోసం ఎదురుచూస్తున్న సీనియర్ నటి

|

May 17, 2021 | 1:44 PM

సినిమా ప్రపంచం చాలా గమ్మత్తుగా ఉంటుంది. పేరు, సంపాదన ఉన్నంతవరకు రాజుల్లా ఉంటారు. అవి రెండు పోతే వారి పరిస్థితి వర్ణించలేనిదిగా ఉంటుంది.

Pavala Syamala: కడుపుబ్బా నవ్వించిన పావలా శ్యామల కన్నీటి గాథ.. సాయం కోసం ఎదురుచూస్తున్న సీనియర్ నటి
Follow us on

Pavala Syamala:

సినిమా ప్రపంచం చాలా గమ్మత్తుగా ఉంటుంది. పేరు, సంపాదన ఉన్నంతవరకు రాజుల్లా ఉంటారు. అవి రెండు పోతే వారి పరిస్థితి వర్ణించలేనిదిగా ఉంటుంది. వయసు మీద పడి అవకాశాలు తగ్గితే కొందరి పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది.  సినిమాల్లో చిన్న చిన్న పాత్రాలు చేసుకుంటూ రోజులు గడిపే వారి పరిస్థితి అవకాశాలు రాకపోతే చాలా దారుణంగా ఉంటుంది. సాయం కోసం కళ్ళు కాయలుకాసేలా  ఎదురుచూస్తూ  ఎంతో మంది సినీకార్మికులు ఉన్నారు. తాజాగా.. తన మాటలతో కామెడీ టైమింగ్ తో ఎంతోమందిని కడుపుబ్బా నవ్వించిన సీనియర్ నటి పావలా శ్యామల పరిస్థితి కూడా ఇప్పుడు దయనీయంగా ఉంది. దాదాపు 250కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె. ఇప్పుడు వయసు మీదపడటంతో పాటు అవకాశాలు కూడా లేక పోవడంతో తీవ్ర ఆర్ధిక ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు కుమార్తె అనారోగ్యం.. మరోవైపు ఆర్థిక సమస్యలతో పావలా శ్యామల పరిస్థితి దారుణంగా మారింది.  ఆర్ధిక ఇబ్బందుల గురించి శ్యామల మాట్లాడుతూ.. “గతంలో నా ఆర్థిక సమస్యలు తెలుసుకున్న మెగాస్టార్‌ చిరంజీవి రూ.2 లక్షలు పంపించారు. ‘గబ్బర్‌సింగ్‌’ సమయంలో పవన్‌ కూడా నాకు సాయం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతినెలా నాకు వచ్చే ఫించన్‌ సైతం మూడు నెలల నుంచి రావడం లేదు. ఇప్పుడు ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంది.” అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. ఇల్లుగడవడానికి తనకు వచ్చిన అవార్డుల్ని అమ్మేసుకున్నారు. పెద్ద మనసున్న వారు తనను ఆదుకోవాలని కోరుతున్నారు పావలా శ్యామల. స్టేజీ ఆర్టిస్ట్‌గా 30 ఏళ్లపాటు ఇండస్ట్రీలో ఉన్నారు శ్యామల. ఎన్నో సన్మానాలు, సత్కరాలు అందుకున్నారు. అనారోగ్యం కారణంగా ఆమె కొంతకాలంగా సినీపరిశ్రమకు దూరంగా ఉంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Vijay Sethupathi : విజయ్ సేతుపతి బాలీవుడ్ సినిమాను అడ్డుకున్న కరోనా.. ఆగిపోయిన షూటింగ్ ..

Ravi Teja’s Khiladi: ఓటీటీ లో మాస్ మహారాజ్ రవితేజ ‘ఖిలాడి’ మూవీ .. క్లారిటీ ఇచ్చిన మేకర్స్