తెలుగు చిత్రపరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు హీరోయిన్ గౌతమి. 80,90’sలో తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. ఏపీలోని శ్రీకాకుళంలో 1969 జూలై 2న జన్మించిన ఆమె.. దయామయుడు సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత రజినీకాంత్, కమల్ హసన్, కృష్ణ వంటి అగ్రకథానాయకులతో కలిసి నటించి మెప్పించింది. ఆయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. 1998లో చెన్నైలో సందీప్ భాటియా అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు గౌతమి. వీరికి సుబ్బులక్ష్మి కూతురు ఉంది. అయితే వీరిద్దరి 1999లోనే విడాకులు తీసుకున్నారు. పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంది గౌతమి.
పెళ్లైన సంవత్సరానికే భర్తతో విడిపోయిన గౌతమి.. అప్పటినుంచి తన కూతురితో కలిసి ఒంటరిగానే ఉంటుంది. అయితే 2004 నుంచి 2016 వరకు కమల్ హాసన్ తో సహజీవనం చేశారు . కానీ ఆ తర్వాత వీరి బంధం అనుహ్యంగా ముగిసింది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తి విడిపోయినట్లుగా అప్పట్లో టాక్ నడిచింది. ప్రస్తుతం తన కూతురితో కలిసి ఉంటుంది. అయితే చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న గౌతమి ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇటీవల స్టోరీ ఆఫ్ థగ్స్ అనే తమిళ్ సిరీస్ చేసిన ఆమె.. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం చిత్రంలోనూ కీలకపాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆమె అన్నీ మంచి శకునములే చిత్రంలో నటిస్తుంది.
ఇదిలా ఉంటే.. గౌతమి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన కూతురితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటారు గౌతమి. ఈక్రమంలోనే గౌతమి కూతురు సుబ్బలక్ష్మి ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతుంది. అందంలో తల్లిని మించి పోయింది.. హీరోయిన్లకు పోటిగా రాబోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.