AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమగా పెంచుకున్న కూతురు సూసైడ్ చేసుకొని చనిపోయింది.. అన్నపూర్ణమ్మ జీవితంలో ఇంత విషాదమా..!

తెలుగు సినీ పరిశ్రమలో తల్లి, అత్త, అమ్మమ్మ వంటి పాత్రలతో ప్రేక్షకులను అలరించిన అలనాటి నటి అన్నపూర్ణ. తన నట జీవితంలోని ఎన్నో ఆసక్తికర విషయాలను, జ్ఞాపకాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అలాగే ఆమె తన కూతురి గురించి ఎమోషనల్ అయ్యారు.

ప్రేమగా పెంచుకున్న కూతురు సూసైడ్ చేసుకొని చనిపోయింది.. అన్నపూర్ణమ్మ జీవితంలో ఇంత విషాదమా..!
Senior Actress Annapurna
Rajeev Rayala
|

Updated on: Aug 27, 2026 | 1:00 PM

Share

ప్రముఖ తెలుగు నటి అన్నపూర్ణమ్మ, దశాబ్దాలుగా వెండితెరపై తల్లి, అత్త పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆమె కెరీర్ 1975లో మోహన్ బాబు సరసన “స్వర్గం నరకం” చిత్రంతో హీరోయిన్‌గా ప్రారంభమైంది. ఇప్పటికీ ఆమె సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఎంతో మందికి అమ్మగా, బామ్మగా నటించిన అన్నపూర్ణమ్మ ఓ ఇంటర్వ్యూలోతన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా తన పెంచుకున్న కుమార్తె గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. అన్నపూర్ణమ్మ దంపతులకు పిల్లలు లేనప్పుడు, వారసుడిగా అబ్బాయిని కాకుండా ఆడపిల్లను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. “ఆడపిల్ల అందంగా ఉంటుంది కదండీ” అనే సాధారణ అభిప్రాయంతో పాటు, “మనం కొంతకాలం పెంచుకోవచ్చు, పెళ్లి చేయొచ్చు, అల్లుడు వస్తాడు. వాడు మగ పిల్లాడే కదా” అనే ప్రాక్టికల్ ఆలోచనతో బంధువుల నుంచి ఒక పాపను తీసుకున్నారు. అప్పటికి పాప వయసు కేవలం ఒకటిన్నర సంవత్సరాలు. ఆమె ఆశలన్నీ తన పెంపుడు కుమార్తె భవిష్యత్తుపైనే పెట్టుకున్నారట.

ఏంది భయ్యా ఈ సిరీస్ ఇలా ఉంది..! పచ్చి బూతులు, బోల్డ్ సీన్స్.. ఒంటరిగా చూడాల్సిందే

తన కుమార్తె ఉన్నత విద్యను అభ్యసించి డాక్టర్ లేదా సివిల్ ఇంజనీర్ కావాలని అన్నపూర్ణమ్మ కోరుకున్నారు. అయితే, పాపకు చదువు అంతగా అబ్బలేదు. పదవ తరగతి వరకు మాత్రమే చదువు కొనసాగించి, ఆ తర్వాత చదువు పట్ల ఆసక్తి చూపలేదు. చదువు అబ్బకపోవడంతో, “పోనీ పెళ్లి చేసేయనా?” అని అడగ్గా, కుమార్తె అంగీకరించిందట. అన్నపూర్ణమ్మ వ్యక్తిత్వంలో ప్రేమ కన్నా బాధ్యతే ముఖ్యమని స్పష్టం చేశారు. “ప్రేమించడం కాదు మన బాధ్యత అనుకుంటాను నేను” అని ఆమె చెప్పారు. తన కుటుంబ సభ్యులందరినీ సమానంగా చూసే ఆమె, కుమార్తెకు వివాహ సమయంలో కూడా ఒక ఫ్లాట్, స్థలం, కొంత డబ్బు, బంగారం సమానంగా పంచినట్లు తెలిపారు. “ఇంతకు మించి మీరు అడగకూడదు, అలా అడిగేలా ఉంటే సంబంధం వద్దు” అని కూడా నిక్కచ్చిగా చెప్పారట.

అతను కమెడియన్ కాదు దేవుడు..! సాయం చేయమని కోరితే.. 3 నెలలకు సరిపడా సరుకులు ఇచ్చాడు..

దురదృష్టవశాత్తు, పెళ్లయిన కొద్ది కాలానికే అన్నపూర్ణమ్మ కుమార్తె తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. “ఆయుష్షు అంతవరకే ఉండి ఉంటుంది” అని అన్నపూర్ణమ్మ ఎమోషనల్ గా చెప్పారు. కుమార్తె మరణానికి గల కారణాలపై ఆమెకు స్పష్టత లేదు. అత్తగారింట్లో ఏమైనా జరిగిందేమో అని సందేహాలు వ్యక్తం చేశారు. ఆమెకు పుట్టిన పాపకు మాటలు సరిగ్గా రాకపోవడం, ఇంటి పనులు చేత కాకపోవడం వంటి విషయాలపై అత్తగారు ఏమైనా అన్నారేమో.. “అమ్మకు చెబితే వినదేమో అనుకుందో ఏమిటో” అని తన కుమార్తె తన బాధను పంచుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఒక్కసారైనా కలవాలి..! మనసులో మాట బయటపెట్టిన బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us