Actress Abhirami: 20 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తోన్న హీరోయిన్.. ‘థగ్ లైఫ్’లో అభిరామి స్పెషల్ రోల్..

సుధీర్ఘ విరామం తర్వాత డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కమల్ నటిస్తున్న సినిమా ఇది. కమల్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోను విడుదల చేశారు. థగ్ లైఫ్ అంటూ షేర్ చేసిన టైటిల్ వీడియో డిఫరెంట్ గా కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటిని కలిగించింది. ఇందులో దుల్కర్ సల్మాన్, త్రిష కీలకపాత్రలలో నటించనున్నారు. ఈ సంద‌ర్భంగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన స‌మాచారం ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది.

Actress Abhirami: 20 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తోన్న హీరోయిన్.. 'థగ్ లైఫ్'లో అభిరామి స్పెషల్ రోల్..
Abhirami
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 23, 2023 | 9:53 PM

ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్నారు కమల్ హాసన్. ఈ సినిమాతోపాటే.. ఇటివలే తన కొత్త ప్రాజెక్ట్ థగ్ లైఫ్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సుధీర్ఘ విరామం తర్వాత డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కమల్ నటిస్తున్న సినిమా ఇది. కమల్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోను విడుదల చేశారు. థగ్ లైఫ్ అంటూ షేర్ చేసిన టైటిల్ వీడియో డిఫరెంట్ గా కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటిని కలిగించింది. ఇందులో దుల్కర్ సల్మాన్, త్రిష కీలకపాత్రలలో నటించనున్నారు. ఈ సంద‌ర్భంగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన స‌మాచారం ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది.

తాజా సమాచారం ప్రకారం సీనియర్ హీరోయిన్ అభిరామి థగ్ లైఫ్ చిత్రంలో నటిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఆమె ముఖ్య పాత్ర పోషిస్తుందట. గతంలో కమల్ జోడిగా విరుమాండి చిత్రంలో నటించింది అభిరామి. 2004లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు మరోసారి కమల్ చిత్రంలో కనిపించనుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ హీరోయిన్ ఇప్పుడు మళ్లీ నటిస్తున్నారు. ‘విరుమండి’ తర్వాత 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు ‘థగ్ లైఫ్’ ద్వారా కమల్‌తో జతకట్టింది అభిరామి. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ధృవీకరించారు. జనవరిలో ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by Abhirami (@abhiramiact)

విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు కమల్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ‘విక్రమ్’ సినిమా ఘనవిజయం తర్వాత యాక్టింగ్, డైరెక్షన్, ప్రొడ్యూస్, బిగ్ బాస్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు కమల్. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే ఇప్పుడు 35 ఏళ్ల తర్వాత మళ్లీ కమల్, మణిరత్నం కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

View this post on Instagram

A post shared by Abhirami (@abhiramiact)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.