తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో హాస్యనటులు ఉన్నారు. అందులో రాజేంద్రప్రసాద్ ఒకరు. తెలుగు తెరపై తనదైన మార్కింగ్ స్టైల్లో హాస్యాన్ని పండించారు. హాస్యమే ప్రధానంగా ఎంచుకుని సినిమాలను చేసిన వారిలో రాజేంద్ర ప్రసాద్ ముందుంటారు. కృష్ణ జిల్లా గుడివాడ దగ్గరలోని దొండపాడు గ్రామంలో ఒక మధ్య తరగతి జన్మించిన రాజేంద్ర ప్రసాద్ మొదటి నుంచి సమయస్పూర్తి.. ఎంతో చురుకైన వ్యక్తి. నటనపై ఆసక్తితో చదువు పూర్తైన తర్వాత చెన్నైలోని ఫిల్మ్ ఇన్‌స్టి్ట్యూట్‌లో నటనకు సంబంధించిన మెళకువలు నేర్చుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం అనేక ప్రయత్నాలు చేశారు. స్నేహం సినిమాతో తెరపైకి ఆరంగేట్రం చేసిన రాజేంద్ర ప్రసాద్.. మూడు మూళ్ళ బంధం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు.
హీరోగా కనిపించాలనే ఆలోచనను ఎన్టీఆర్ దగ్గర ప్రస్తావించగా.. ఆయన రాజేంద్ర ప్రసాద్‌కు సలహా ఇచ్చారట. ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో ఉన్న హీరోలు ఒక్కొక్కరు ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉన్నారు. ఎవరు వెళ్లని దారిలో ట్రై చేయాలని సూచించగా.. కామెడీని ఆయుధంగా చేసుకున్నారు. ప్రేమించు పెళ్లాడు సినిమాతో హీరోగా మారాడు రాజేంద్ర ప్రసాద్. ఇక ఆ తర్వాత ఆయనకు కథనాయకుడిగా వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. అటు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టూగానూ నటించాడు. రాజేంద్ర ప్రసాద్‌కు హీరోగా గుర్తింపు తీసుకొచ్చిన సినిమాలు.. రెండు రెళ్ల ఆరు.. అహా నా పెళ్లంట, ముత్యమంత ముద్దు. ఏప్రిల్ 1 విడుదల .. లేడీస్ టైలర్.. అప్పుల అప్పారావు.. మాయలోడు.. ఆ ఒక్కటీ అడక్కు.. కొబ్బరి బొండాం .. పెళ్లి పుస్తకం.. రాజేంద్రుడు – గజేంద్రుడు సినిమాలు రాజేంద్ర ప్రసాద్‌ను హీరోగా నిలబెట్టాయి. తక్కువ బడ్జెట్లో హిట్ మూవీస్ చేయడం రాజేంద్రుడి స్టైల్. కామెడీని అస్త్రంగా చేసుకుని హీరోయిజాన్ని చూపించడంలో రాజేంద్ర ప్రసాద్ ముఖ్యులు. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడమే కాదు.. బరువైన పాత్రలతో కన్నీళ్లు పెట్టించడం కూడా రాజేంద్రప్రసాద్‌కు సాధ్యం. ఆ నలుగురు.. మీ శ్రేయోభిలాషి… ఓనమాలు సినిమాలతో ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించారు. ఇప్పటికీ చేతిలో నాలుగైదు చిత్రాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. ఇప్పటికీ తన టైమింగ్ కామెడీతో ప్రేక్షకులను అలరిస్తున్న రాజేంద్ర ప్రసాద్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన మరెన్నో విజయాలను అందుకోవాలని ఆశిస్తూ.. టీవీ9 తెలుగు శుభాకాంక్షలు తెలుపుతుంది.
Siddharth: యంగ్ ఏజ్‌లో మరణించిన తారల్లో సిద్ధార్థ్ ఒకరంటూ వీడియో.. దీనిపై హీరో ఎలా స్పందించాడంటే..