డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ నటించిన సినిమా అంటే సుందరానికీ. ప్మరుఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ పై అంచానాలు భారీగానే నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే.. నజ్రియా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కథానాయికగా పరిచయం కాబోతుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా జూన్ 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం భాషలలో విడుదల కాబోతుంది. ఇందులో నాని తండ్రిగా సీనియర్ నటుడు నరేష్ వి.కె నటించారు. అంటే సుందరానికీ మూవీ ప్రమోషన్లలో భాగంగా నటుడు నరేష్ మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
నరేష్ మాట్లాడుతూ..” నా కెరీర్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతమైన పాత్రలు పోషించడం అదృష్టం. నేను పోషించిన తండ్రి పాత్రలకు ఆడపిల్లలనుంచి మంచి ఫాలోయింగ్ వచ్చింది. అ..ఆ., భలేభలేమగాడివోయ్, సమ్మోహనం వంటి చిత్రాల్లో బెస్ట్ ఫాదర్ గా నిలిచాయి. అంటే సుందరానికీ` సినిమాలో నానికీ నాకు మంచి ర్యాపో వుంది. నాని కామెడీ టైమింగ్ చాలా స్పార్క్‌గా వుంటుంది. సెకన్‌లో క్యాచ్ చేసేస్తాడు. నేను ఆ స్కూల్ నుంచి వచ్చినవాడిని కనుక నాకు తెలుసు. నేను ఇందులో చేసిన ఫాదర్ పాత్ర `ది బెస్ట్` అని చెప్పగలను. దానికి రెండు కారణాలున్నాయి. మొదటిది దర్శకుడు రూపుదిద్దిన విధానం, రెండోది.. నాని, నాకూ మధ్య కామెడీ టైమింగ్. ఎమోషన్ ను క్యారీ చేస్తూ ఆడియన్స్‌ను నవ్వించే పాత్ర. కీలకమైన పాత్ర ఇది. నానితో ఫాదర్ గా, దేవదాసులో బ్రదర్ గా చేశాను. మళ్ళీ ఫాదర్ గా చేశాను. మా ఇద్దరి మధ్య డిఫరెంట్ ఎమోషన్స్ కూడినవి. మేమిద్దరం నటిస్తుంటే సెట్లో అందరూ లీనమైపోయి ఓన్ చేసుకున్నారు. అలాగే రోహిణి పాత్ర కూడా. తను మంచి నటి. ఈ సినిమా తర్వాత నెక్ట్స్ లెవల్ పాత్ర కోసం నేను ఎదురుచూడాల్సివుంటుంది. నానికి చాలా కాలం తర్వాత హ్యూమర్ జోనర్ పడడం అదృష్టం.
ఈ సినిమాకు మరోచరిత్ర, సీతాకోకచిలుక సినిమాలతో సంబంధం లేదు.. అవి వేరే సినిమాలు ఇది వేరే సినిమా. నటుడిగా నాకు తృప్తినిచ్చిన సినిమా. నా కెరీర్ ను తర్వాత స్థాయికి తీసుకెళ్ళే సినిమా అవుతుంది. ఈ సినిమాలో సాంప్రదాయాలు, కట్టుబాట్లు గల కుటుంబం కనుక చిన్నప్పటినుంచి ఒక పద్దతిలో నాని పెరిగినవాడు. అలాంటివ్యక్తి స్వంత నిర్ణయాలు తీసుకుంటే ఎలా వుంటుందనేది సినిమా. ఇప్పటివరకు పెండ్లిచూపులు, పెండ్లి తంతు వుండేవి. కానీ కాలం మారడంతో రివర్స్ అయింది. అందుకే నాని పాత్రకు ఇప్పటి జనరేషన్ బాగా కనెక్ట్ అవుతారు. రెండు భిన్నమైన మనస్తత్వాలు గల కుటుంబాల మధ్య ఏం జరిగింది అనేది ఆసక్తిగా వుంటుంది. నేను ఇప్పటివరకు 200కుపైగా సినిమాలు చేశాను. కానీ ఈ సినిమాలో బ్రాహ్మణుని పాత్రకు యాసలో డబ్బింగ్ చెప్పడానికి 9రోజులు పట్టింది. ఇలా ఎప్పుడూ జరగలేదు. ఇదంతా వివేక్ ఆత్రేయ డ్రాఫ్టింగ్ వల్లే. ఆయనకు మంచి క్లారిటీ ఉంది” అంటూ చెప్పుకొచ్చారు.