Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజుకు ప్రమాదం.. ఆపరేషన్.. ఇంతకీ ఏం జరిగిందంటే..

|

Mar 09, 2022 | 7:15 PM

మోస్ట్ అవైయిటెడ్ చిత్రం రాధేశ్యామ్ (Radhey Shyam). ప్రభాస్..పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజుకు ప్రమాదం.. ఆపరేషన్.. ఇంతకీ ఏం జరిగిందంటే..
Kirshnam Raju
Follow us on

మోస్ట్ అవైయిటెడ్ చిత్రం రాధేశ్యామ్ (Radhey Shyam). ప్రభాస్..పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. భారీ బడ్జెట్‏తో యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాను.. పాన్ ఇండియా లెవల్లో మార్చి 11న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా.. ప్రభాస్..పూజా హగ్డే.. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్.. ఆఖరుకు ప్రభాస్ పెద్దమ్మ శ్యామాల దేవి కూడా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గోంటున్నారు.

అయితే రాధేశ్యామ్ ప్రమోషన్స్‏లో సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఎక్కడా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే.. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ప్రమదానికి గురయ్యారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఆయన ఇంట్లో కాలు జారి కిందపడిపోయారని.. దీంతో ఆయనకు ఆపరేషన్ జరిగిందని.. ప్రస్తుతం ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. సర్జరీలో భాగంగా.. ఆయన కాలి వేలుని తొలిగించాల్సి వచ్చిందట. దీంతో రెబస్ స్టార్ ప్రమాదం గురించి తెలిస్తే ఫ్యాన్స్ కంగారు పడే అవకాశం ఉందని.. ఇప్పటివరకూ ఈ విషయాన్ని రహస్యంగా ఉంచినట్లుగా ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం కృష్ణం రాజు ఆరోగ్యంగానే ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల కృష్ణరాజు భార్య శ్యామాల దేవి ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆరోగ్యం గురించి స్పందించారు. కృష్ణం రాజు నిజంగానే ఇంట్లో కాలు జారిపడ్డారని తెలిపారు. కానీ సర్జరీ విషయం మాత్రం బయటపెట్టలేదు. ఆపరేషన కారణాంగానే రాధేశ్యామ్ ప్రమోషన్స్‏లో పాల్గొనలేదని.. సినిమా విడుదలైన తర్వాత కృష్ణం రాజు మీడియా ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

Also Read: Pooja Hegde: ప్రభాస్..పూజా హెగ్డే మధ్య గొడవలు.. అసలు విషయం చెప్పేసిన టాలీవుడ్ బుట్టబొమ్మ..

Malavika Mohanan: ఆ వార్తలు బాధను కలిగిస్తాయి.. అయినా మంచి అనుభవమే.. షాకింగ్ కామెంట్స్ చేసిన మాళవిక..

Rajamouli: తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై డైరెక్టర్ రాజమౌళి ఆసక్తికర ట్వీట్స్.. ఏమన్నారంటే..

Poonam Kaur: పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్.. దర్శకుడు రాక్షసంగా ప్రవర్తించాడంటూ..