AP Theaters Ticket Price: ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై నియంత్రణ ఉండాలన్న ప్రభుత్వ నిర్ణయంపై టాలీవుడ్ భగ్గుమంటోంది. ధరలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిది? మా సినిమాకు మీరేలా ధర కడతారు అంటూ ఆర్జీవీ ఇప్పటికే జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయనకు మద్దతుగా చాలా మంది సెలబ్రెటీలు తమ సోషల్ మీడియా వేదికగా తమ గళాన్ని వినిపించారు. అయితే టికెట్ల రేట్ ఇష్యూపై తాజాగా సీనియర్ నటుడు సి.వీ.ఎల్ నరసింహరావు స్పందించారు.
అభిమానుల తమ అభిమాన హీరో కోసం వేయి రూపాయిలైనా ఖర్చు చేస్తాడు.. వారికీ ఇబ్బంది లేదు.. అయితే అలా ఓ కామన్ మ్యాన్ తన కుటుంబంతో కలిసి వెళ్ళలేడు.. అయితే ఇపుడు ఏపీ సర్కార్ సామాన్యుడికి అందుబాటులో టికెట్ ధరలను తీసుకుని వచ్చేలా చర్యలు తీసుకోవడం చాలా మంచి విషయం అని సీవీఎల్ అన్నారు. ఒకవేళ టికెట్ రేట్లు పెరిగినా ఓ అయిదారు బడా ప్రొడ్యూసర్ల జేబులు మాత్రమే నిండుతాయని… పెంచకపోయినా వారు నష్టాల పాలు కారనే అభిప్రాయన్ని సీవీఎల్ వ్యక్తం చేశారు. అయితే వారికోసం మాత్రమే కామన్ మ్యాన్ను ఇబ్బంది పెట్టడం సరికాదని.. ఈ విషయంలో కామన్ మ్యాన్ పక్షాన నిలిచినందుకు జగన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. ఏపీ సర్కారుకు థియేటర్ సినిమా టికెట్ ధరల తగ్గింపు పై ఈ సీనియర్ నటుడు నరసింహ రావు అండగా నిలబడ్డారు.
Also Read: పాక్ మిత్ర దోహంపై తాలిబన్లు సీరియస్.. ఇస్లామాబాద్ పెద్దలకు గట్టి వార్నింగ్