Chandra Mohan: నేడు పంజాగుట్టలో చంద్రమోహన్ అంత్యక్రియలు..

దాదాపు 980 సినిమాల వరకు నటించి మెప్పించారు చంద్రమోహన్. హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు చంద్రమోహన్. చంద్రమోహన్ మరణ వార్తవిని టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. చాలా మంది నటీ నటులు చంద్రమోహన్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు.

Chandra Mohan: నేడు పంజాగుట్టలో చంద్రమోహన్ అంత్యక్రియలు..
Chandra Mohan

Updated on: Nov 13, 2023 | 10:06 AM

సీనియర్ నటుడు చంద్రమోహన్ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెల్సిందే. శనివారం రోజున ఉదయం 9.40గంటల ప్రాంతంలో కన్నుమూశారు. దాదాపు 980 సినిమాల వరకు నటించి మెప్పించారు చంద్రమోహన్. హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు చంద్రమోహన్. చంద్రమోహన్ మరణ వార్తవిని టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. చాలా మంది నటీ నటులు చంద్రమోహన్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో చంద్రమోహన్ మృతికి సంతాపం తెలిపారు . మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, సాయి ధరమ్ తేజ్ కూడా సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం తెలిపారు.

నటుడు చంద్రమోహన్‌ అంత్యక్రియలు ఇవాళ పంజాగుట్ట శ్మశానవాటికలో జరగనున్నాయి. దానిలో భాగంగా.. చంద్రమోహన్ నివాసం నుంచి పంజాగుట్ట వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. ఇక.. అనారోగ్యంతో రెండు రోజుల క్రితం చంద్రమోహన్‌ తుదిశ్వాస విడవగా.. పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. చంద్రమోహన్‌ భౌతికకాయానికి అల్లు అరవింద్‌ పూలమాల వేసి నివాళులు అర్పించారు.

దీపావళి కావడం అందులోనూ చంద్రమోహన్ చిన్న కూతురు అమెరికా నుంచి రావడానికి ఆలస్యం కావడంతో చంద్రమోహన్ అంత్యక్రియలు ఆలస్యం అయ్యాయి. నేడు పంజాగుట్ట శ్మశానవాటికలో చంద్రమోహన్ జరగనున్నాయి. చంద్రమోహన్ సోదరులు (తమ్ముడు) మల్లంపల్లి దుర్గాప్రసాద్ గారు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

చిరంజీవి ట్విట్టర్ పోస్ట్..

ఎన్టీఆర్ ట్విట్టర్ పోస్ట్

సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.