
Sekhar Kammula : బహుబలి సినిమాల తర్వాత రానా దగ్గుపాటి నటిస్తున్న చిత్రం ‘అరణ్య’. ఈ సినిమాను హిందీలో ‘హాథీ మేరే సాథీ’గా రూపొందుతుంది. ప్రభు సాలొమోన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ గతేడాది ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉండగా.. లాక్డౌన్ ప్రభావంతో వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాదన్’ పేర్లతో విడుదల కానుంది. శాంతను సంగీతం అందించిన ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా హైదరాబాద్ పార్క్ హయాత్ హోటల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ముఖ్య అతిథిగా హాజరైన విక్టరి వెంకటేష్ అరణ్య మూవీ స్పెషల్ ప్రోమోని రిలీజ్ చేశారు.ఇక ఈ కార్యక్రమానికి దర్శకుడు శేఖర్ కమ్ముల మరో గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ – ‘‘దర్శకుడు ప్రభు తన ఫేస్‌ను చూసి అరణ్య సినిమాకు తనను హీరోగా తీసుకున్నాడని రానా అన్నారు. కానీ నేను రానా వాయిస్ విని లీడర్ సినిమాకు హీరోగా తీసుకున్నాను. లీడర్ సినిమా పూర్తయ్యి అప్పుడే పదేళ్లు పూర్తవుతున్నాయి. రానా ఎప్పుడు విభిన్నమైన సినిమాలను చేస్తాడు. డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తాడు. అరణ్య సినిమాలో రానా యాక్టింగ్ సూపర్‌గా ఉంటుంది. అరణ్య సినిమాలో ఇంటర్‌నేషనల్ స్టాండర్ట్స్ కనిపిస్తున్నాయి. అరణ్య సినిమా ప్రేక్షకులు అందరికి నచ్చుతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ అండ్ కిడ్స్‌లకు కూడా నచ్చే సినిమా ఇది“ అన్నారు శేఖర్ కమ్ముల.
మరిన్ని ఇక్కడ చదవండి :
Rana Daggubati : ఏనుగులతో ఉన్న రిలేషన్ వల్ల నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి..
Venkatesh Daggubati : ఏదో అనుకున్న కానీ రానా చాలా ఎదిగిపోయాడు.. ఎమోషనల్ అయిన వెంకీమామ