డీజే టిల్లు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ. హీరోగా సిద్దు జొన్నల గడ్డ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. చిన్న సినిమాగా వచ్చిన డీజే టిల్లు మూవీ భారీ విజయం అందుకుంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రానుంది. డీజే టిల్లు సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించింది. అలాగే ఈ సినిమానుంచి మొదటి సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కూడా సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో సెకండ్ సాంగ్ నుంచి ప్రోమోను రిలీజ్ చేశారు.
ఈ సాంగ్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. యూత్ ను ఆకట్టుకునే లిరిక్స్ తో ఈ సాంగ్ సాగింది. రాధికా అంటూ సాంగ్ ఈసాంగ్ ను కాసర్ల శ్యామ్ రచించారు. రామ్ మిరియాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ లో హీరో హీరోయిన్ ను టీజ్ చేస్తున్న సన్నివేశంలో ఈసాంగ్ వస్తుందని అర్ధమవుతుంది.
ఇక డీజే టిల్లు సీక్వెల్ సినిమా లో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. డీజే టిల్లు సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. రాధికా సాంగ్ ను ఈ నెల 27న సాయంత్రం 4.05 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 9 , 2024లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.