Rahasyam Idham Jagath Review: సైన్స్ ఫిక్షన్‌లో సరికొత్త ప్రయత్నం.. రహస్యం ఇదం జగత్ సినిమా ఎలా ఉందంటే

సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథాలాజికల్‌ థ్రిల్లర్స్ కు ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. ఇదే జోనర్లో తాజాగా వచ్చిన సినిమా రహస్యం ఇదం జగత్. మన పురాణాలు, ఇతిహాసాల గురించి.. శ్రీచక్రం గురించి చర్చిస్తూ ఓ కొత్త అనుభూతిని కలిగించేలా ఈ సినిమా..

Rahasyam Idham Jagath Review: సైన్స్ ఫిక్షన్‌లో సరికొత్త ప్రయత్నం.. రహస్యం ఇదం జగత్ సినిమా ఎలా ఉందంటే
Rahasyam Idam Jagath
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Rajeev Rayala

Updated on: Nov 08, 2024 | 2:00 PM

మూవీ రివ్యూ: రహస్యం ఇదం జగత్

నటీనటులు: రాకేష్‌ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్‌ గోపీనాథం, కార్తీక్ తదితరులు

సంగీతం: గ్యానీ

ఎడిటర్: ఛోటా కే ప్రసాద్

సినిమాటోగ్రఫీ: టైలర్ బ్లూమెల్

నిర్మాతలు: పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల

దర్శకత్వం: కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌

సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథాలాజికల్‌ థ్రిల్లర్స్ కు ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. ఇదే జోనర్లో తాజాగా వచ్చిన సినిమా రహస్యం ఇదం జగత్. మన పురాణాలు, ఇతిహాసాల గురించి.. శ్రీచక్రం గురించి చర్చిస్తూ ఓ కొత్త అనుభూతిని కలిగించేలా ఈ సినిమాను తెరకెక్కించాము అంటున్నాడు దర్శకుడు కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌. తాజాగా సినిమా విడుదలైంది. మరి ఆయన మాటలు నిజమా కాదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.

కథ:

రహస్యం ఇదం జగత్ సినిమా కథ మొత్తం అమెరికాలో జరుగుతుంది. ఇండియాలో ఉన్న తండ్రి చనిపోవడంతో తల్లి కోసం ఇండియాకు షిఫ్ట్ అయిపోదాం అనుకుంటుంది అకీరా (స్రవంతి). ఈమె బాయ్ ఫ్రెండ్ అభి (రాకేష్) కూడా అకీరా కోసం ఇండియా వెళ్ళిపోదామని ఫిక్స్ అవుతాడు. వెళ్లే ముందు స్నేహితులందరికీ పార్టీ ఇవ్వాలి అనుకుంటాడు. దాంతో ఫ్రెండ్స్ కళ్యాణ్, అరుతో పాటు.. అకీరా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ విశ్వ కూడా వస్తాడు. వాళ్ళు బుక్ చేసుకున్న హోటల్ మంచు కురవడంతో క్లోజ్ అవుతుంది. దాంతో అక్కడే ఓ ఖాళీ ఇంట్లో రాత్రికి స్టే చేయాల్సి వస్తుంది. ఆ స్నేహితులలో అరు సైంటిస్ట్. మల్టీ యూనివర్స్ పై ఆమె రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. దీంతో స్నేహితుల మధ్యలో యూనివర్స్ టాపిక్ వస్తుంది. ఈ క్రమంలో అకీరా కోసం అభి, విశ్వకు గొడవ జరుగుతుంది. అదే సమయంలో విశ్వ ఓ భయంకరమైన డ్రగ్ తీసుకొని అకీరా, కళ్యాణ్ లను చంపేస్తాడు. మరోవైపు మల్టీ యూనివర్స్ కి వెళ్లే దారి ఆ ఊళ్ళోనే ఉందని తెలుసుకొని అభిని తీసుకొని వెళ్తుంది అరు. అక్కడ అరుని ఎవరో కాల్చి చంపేస్తారు. అసలు ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి..? నిజంగానే మల్టీ యూనివర్స్ ఉందా..? ఆ తర్వాత ఏం జరిగింది అనేది అసలు కథ..

కథనం:

ఈ మధ్య కొన్ని చిన్న సినిమాలలో మంచి కథ, కథనం ఉంటున్నాయి. తక్కువ బడ్జెట్ లో కూడా మంచి అవుట్ పుట్ ఇవ్వాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు. అలా వచ్చిన సినిమా రహస్యం ఇదం జగత్. ఈ సినిమాను పూర్తిగా అమెరికాలోనే తెరకెక్కించారు. అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు ఈ సినిమాను నిర్మించారు. హాలీవుడ్ లో ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్.. లాంటి టైం ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఈ సినిమా కథ రాసుకోవడానికి ఇన్స్పిరేషన్ అనే విషయం అర్థం అవుతుంది. వాళ్లకు ఉన్న బడ్జెట్ లిమిటేషన్స్లో సినిమాలు బాగానే తెరకెక్కించారు. మన ప్రేక్షకులకు కనెక్ట్ చేయడానికి పురాణాలని కూడా వాడుకున్నారు. హనుమంతుడు ఒక లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్ళడం.. కృష్ణుడు ఒకేసారి చాలా చోట్ల కనిపించడం.. శ్రీచక్రం నుంచి వామ్ హోల్ ఏర్పడటం లాంటి మైథలాజి ఉదాహరణలు చూపించారు. సినిమా మొదలవడం కాస్త నెమ్మదిగా మొదలవుతుంది. ఇండియాలో హీరోయిన్ వాళ్ళ నాన్న చనిపోవడం.. అక్కడ్నుంచి దేశం మారాలనుకోవడం.. వెంటనే ట్రిప్.. ఫ్రెండ్స్ మధ్య గొడవలు.. చంపుకోవడాలు.. ఇవన్నీ బాగానే వేగంగా వెళ్లిపోయాయి. ఇంటర్వెల్ ముందు అభి స్నేహితులు చనిపోవడంతో.. వాళ్ళను కాపాడుకోవడానికి వామ్ హోల్ కి వెళ్లడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఆసక్తి క్రియేట్ చేసాడు దర్శకుడు కోమల్. సెకండాఫ్ కూడా బాగానే తీసుకెళ్లాడు. ముఖ్యంగా క్లైమాక్స్ బాగా రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ సీన్స్ అన్నీ లింక్ పెడుతూ రాసుకున్న స్క్రీన్ ప్లే బాగుంది. రొటీన్ సినిమా కాకుండా.. కొత్త సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

నటీనటులు:

చాలా షార్ట్ ఫిలిమ్స్‌లో నటించి మెప్పించిన రాకేష్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. వామ్ హోల్‌లోకి ట్రావెల్ చేసి వచ్చే వ్యక్తిగా బాగున్నాడు. మిగిలిన వాళ్లంతా కొత్త వాళ్లే. అందులో స్రవంతి చాలా బాగా నటించింది. సైంటిస్ట్ పాత్రకు అరు పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. భార్గవ్ అక్కడక్కడా కామెడీతో నవ్వించాడు. కార్తీక్ విలన్‌గా బాగున్నాడు. వీళ్లంతా అమెరికాలోనే సెటిల్ అవ్వడం.. థియేటర్ ఆర్టిస్టులు కావడంతో కొత్త మొహాలుగా ఉన్నారు మన ఆడియన్స్‌కు. అదొక్కటే ఈ సినిమాకు మైనస్. అందరూ అమెరికన్ యాక్సెంట్‌తోనే మాట్లాడారు.

టెక్నికల్ టీం:

చిన్న సినిమా అయినా.. బడ్జెట్ లిమిటేషన్స్ ఉన్నా కూడా రహస్యం ఇదం జగత్ సినిమాను బాగానే తెరకెక్కించారు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. అమెరికాలో ఉన్న మంచి మంచి లొకేషన్స్ పట్టుకొచ్చారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు. పాటలు జస్ట్ ఓకే. డబ్బింగ్‌పై కాస్త ఫోకస్ చేయాల్సింది. దర్శకుడికి డెబ్యూ మూవీ అయినా కూడా బాగానే హ్యాండిల్ చేసాడు. కొత్త కథ ట్రై చేసాడు. నిర్మాణ పరంగా కూడా ఉన్నంతలో బానే ఖర్చుపెట్టి తీసారు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా ‘రహస్యం ఇదం జగత్’.. సైన్స్ ఫిక్షన్‌లో సరికొత్త ప్రయత్నం..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!