Varalaxmi Sarathkumar: నటి వరలక్ష్మి పెళ్లికి ఏకంగా రూ. 200 కోట్ల ఖర్చు.. తండ్రి శరత్ కుమార్ ఏమన్నారంటే?

|

Jul 08, 2024 | 10:28 AM

ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. ముంబైకు చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్ తో కలిసి ఆమె ఏడడుగులు నడిచింది. థాయ్‌లాండ్‌ వేదికగా జులై 2న వీరి వివాహం ఘనంగా జరిగింది. టాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వరలక్ష్మి వివాహ వేడుకలో పాల్గొన్నారు.

Varalaxmi Sarathkumar: నటి వరలక్ష్మి పెళ్లికి ఏకంగా రూ. 200 కోట్ల ఖర్చు.. తండ్రి శరత్ కుమార్ ఏమన్నారంటే?
Varalakshmi Sarathkumar wedding
Follow us on

ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. ముంబైకు చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్ తో కలిసి ఆమె ఏడడుగులు నడిచింది. థాయ్‌లాండ్‌ వేదికగా జులై 2న వీరి వివాహం ఘనంగా జరిగింది. టాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వరలక్ష్మి వివాహ వేడుకలో పాల్గొన్నారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇక పెళ్లికి రాని వారి కోసం చెన్నైలోని తాజ్ హోటల్ లో ఘనంగా రిసెప్షన్‌ కార్యక్రమాన్ని జరిపించారు. ఈ వేడుకకు తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అదే సమయంలో వరలక్ష్మి పెళ్లి ఖర్చు గురించి తమిళనాట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదేంటంటే.. వరలక్ష్మ పెళ్లి కోసం రూ. 200 కోట్లకు పైగానే శరత్ కుమార్ ఖర్చు చేశారట. దీనికి సంబంధించిన రూమర్లు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.

ఈ రూమర్లపై వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ స్పందించారు. ‘అంత డబ్బు ఎక్కడుందో నాకు తెలియదు. అలాంటి వార్తలు పూర్తిగా అవాస్తవం. ఏమీ తెలియక తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారు. పెళ్లి కోసం అంత ఖర్చు చేయడం ఏంటి..? చాలా సింపుల్ గానే నా బిడ్డ పెళ్లి చేశాను. నిజాలు ఏంటో తెలియకుండానే ఊహించుకొని తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి’ అని శరత్ కుమార్ సమాధానమిచ్చారు.

ఇవి కూడా చదవండి

 

కాగా ముంబైలోని అత్యంత సంపన్నుల్లో వరలక్ష్మి భర్త నికోలాయ్ సచ్ దేవ్ కూడా ఒకరు. అక్కడ ఆయనకు సొంత ఆర్ట్ గ్యాలరీ ఉంది. నికోలాయ్ కు సుమారు రూ. 900 కోట్ల ఆస్తులున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక ఆయనకు ఇది వరకే వివాహమైంది. 15 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే వరలక్ష్మి ని రెండో వివాహం చేసుకున్నారు సచ్ దేవ్. వివాహ వేడుక సందర్భంగా నికోలాయ్ తన భార్యకు బంగారు చెప్పులు, డైమండ్ చీరను బహుమతిగా ఇచ్చాడని టాక్. వీటి విలువే సుమారు రూ.200 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.

రాధిక, శరత్ కుమార్ ల డ్యాన్స్ ఇదిగో.. వీడియో

వరలక్ష్మి ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. ఫొటోస్ ఇదిగో..

మెహెందీ వేడుకల్లో కాబోయే పెళ్లి కూతురు వరలక్ష్మి.. ఫొటోస్ ఇదిగో..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.