
తాజాగా ఒక సినిమా వేదికపై జరిగిన ఈ అరుదైన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఒకప్పుడు కోలీవుడ్ సుప్రీం స్టార్. తన గంభీరమైన నటనతో, కంచు కంఠంతో ప్రేక్షకులను మెప్పించారు. సినిమా జీవితం ఎంత కలర్ ఫుల్ గా ఉందో, ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా అన్నే మలుపులు ఉన్నాయి. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి, ఆ తర్వాత ఒక స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకున్నారు. అయితే ఏళ్ల కాలం గడిచినా, మొదటి భార్య మాత్రం ఎప్పుడూ మీడియా ముందుకు వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. తాజాగా తన కూతురు సినిమా ఫంక్షన్ కు హాజరైన ఆమె, స్టేజీపై మైక్ పట్టుకుని తన భర్త రెండో భార్య గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ కుటుంబం మరెవరో కాదు నటుడు శరత్ కుమార్ ఫ్యామిలీ.
నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తూ, తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా ‘సరస్వతి’**. ఇదొక గ్రిప్పింగ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కింది. ఈ సినిమా మార్చి 6వ తేదీన (శుక్రవారం) థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్
Raadhika Sarath Kumar
లో ఆదివారం మధ్యాహ్నం భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరలక్ష్మి తల్లి, శరత్ కుమార్ మొదటి భార్య ఛాయాదేవి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
ఈ వేదికపై ఛాయాదేవి మాట్లాడుతూ కొన్ని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. “తొలినాళ్లలో నేను దూరదర్శన్‌లో యాంకర్‌గా పనిచేశాను. ఆ సమయంలో రాధికను ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. మా కుటుంబానికి అండగా నిలబడినందుకు రాధికకు ధన్యవాదాలు. అలాగే ‘థాయ్ కెలవి’ సినిమా హిట్ అయినందుకు శుభాకాంక్షలు. అందులో మీ నటన అద్భుతంగా ఉంది” అంటూ రాధికను ప్రశంసలతో ముంచెత్తారు. ఒకే వేదికపై ఇద్దరు భార్యలు ఇలా ఎంతో హుందగా ప్రవర్తించడం చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.
Sarath Kumar With His Ex Wife
నటుడు శరత్ కుమార్ 1984లో ఛాయాదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి వరలక్ష్మి, పూజ అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే మనస్పర్థల కారణంగా 2000 సంవత్సరంలో వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఏడాది శరత్ కుమార్ నటి రాధికను రెండో వివాహం చేసుకున్నారు. వీరికి రాహుల్ అనే కుమారుడు ఉన్నాడు. ఛాయాదేవి ప్రస్తుతం శరత్ కుమార్ తో కలిసి ఉండకపోయినా, పిల్లల విషయంలో మాత్రం అందరూ కలిసికట్టుగానే ఉంటున్నారు.
ముఖ్యంగా వరలక్ష్మికి రాధికతో మంచి అనుబంధం ఉంది. వరలక్ష్మి పెళ్లిని కూడా రాధిక దగ్గరుండి జరిపించడం విశేషం. విడిపోయిన తర్వాత కూడా ఒకరినొకరు గౌరవించుకుంటూ, పిల్లల భవిష్యత్తు కోసం కలిసి నిలబడటం గొప్ప విషయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. శరత్ కుమార్ కుటుంబం నిజంగానే అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసిస్తున్నారు.