‘Saranga Dariya’ Controversy: సారంగదారియా సాంగ్ ఎవరిదీ కాదు.. అసలు ఆ లిరిక్స్ కు సంబంధమే లేదు 70 ఏళ్ల క్రితం నుంచి ఉంది.. ఇదిగో సాక్ష్యం

|

Apr 06, 2021 | 9:05 AM

'Saranga Dariya' Controversy: నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రేమ కథ చిత్రం.. లవ్ స్టోరీ. ఈ సినిమాలో తెలంగాణ జానపద పాట పల్లవి దాని కుడి భుజం మీద కడువ..

Saranga Dariya Controversy: సారంగదారియా సాంగ్ ఎవరిదీ కాదు.. అసలు ఆ లిరిక్స్ కు సంబంధమే లేదు 70 ఏళ్ల క్రితం నుంచి ఉంది.. ఇదిగో సాక్ష్యం
Komali Vs Sarangadaria
Follow us on

‘Saranga Dariya’ Controversy: నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రేమ కథ చిత్రం.. లవ్ స్టోరీ. ఈ సినిమాలో తెలంగాణ జానపద పాట పల్లవి దాని కుడి భుజం మీద కడువ.. దాని కుత్తేపు రైకలు మేరియా రమ్మంటే రాదు చెలియా…. దాని పేరే సారంగ దారియా తో సాగే టీజర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.. ఈ పాటకి సాయి పల్లవి ఆట తోడై.. ఓ రేంజ్ లో సంగీత అభిమానులను అలరిస్తుంది. అయితే అదే సమాయంలో ఈ సాంగ్ చుట్టూ వివాదాలుఅల్లుకున్నాయి. రిలీజైన మొదటి రోజు నుంచి కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. సినిమాలోని ఈ సాంగ్ ను ప్రముఖ పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ రాసినట్లు స్కీం మీద వేశారు.

దీంతో సాంగ్ నాదంటే నాదంటూ కొంతమంది సింగర్స్ సీన్ లోకి వచ్చారు. ఆ పాటను మొదటిసారి పాడింది నేను అని శిరీష వాదిస్తే.. అసలు ఆ పాటను వెలుగులోకి తెచ్చింది నేనే అని రేలారే ఫేమ్ జానపద గాయని కోమలి వాదించింది. ఆ పాట రచయిత పక్కన తన పేరును సేకరణ గా పెట్టాలని కోరింది. తనకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని అంటూ సుద్దాల అశోక్ తేజ మీద ఆరోపణలు చేసింది. తనకు లవ్ స్టోరీ సినిమా యూనిట్ అన్యాయం చేశారంటూ నానా హంగామా చేసింది. అయితే ఈ వివాదానికి చెక్ పెట్టడానికి శేఖర్ కమ్ముల కోమలి కొన్ని హామీలిచ్చి ఫుల్ స్టాప్ పెట్టేశారు.

అయితే చాలామంది పెద్దలు మాత్రం ఒక జానపద పాటకు హక్కులు ఏ ఒక్క వ్యక్తికీ ఎలా సొంతం అవుతాయని ప్రశ్నిస్తున్నారు. పాడిన వారికి ఆ సాంగ్ మీద హక్కులు సొంతమవుతాయా అని అంటున్నారు. సమాజానికి చెందిన జానపదులకు సొంతం చేసుకునే హక్కు ఉంటుందా .. ఎక్కడ చూసినా సర్వత్రా ఇదే మాటలు వినిపించాయి.

అయితే కోమలి తానె ముందుగా ఈ పాటను పాడి వెలుగులోకి తీసుకొచ్చాను అన్న మాటల్లో వాస్తవం లేదనే విషయం తెలుస్తోంది. ఎందుకంటే సారంగదారియా సాంగ్ ఎప్పుడో పాడ‌టంతో పాటు పుస్త‌కాల్లోనూ అచ్చు అయ్యింద‌నే విషయం వెలుగులోకి వచ్చింది.

తెలంగాణ ప‌ల్లె పాటలు అనే పుస్త‌కంలో ఈ పాట ఉంది. కుడి భుజం మీద కడువ..జానపద పల్లె పాటను బిరుద‌రాజు రామ‌రాజు అనే ర‌చ‌యిత రాశారు. అంతేకాదు ఈ జాన‌ప‌దం 1952లోనే న‌ల్ల‌గొండ జిల్లా న‌కిరేక‌ల్లులో పాపయ్య, భద్రయ్య, లింగయ్య తదితరులు  పాడుతుంటే తాను విన్నాన‌ని ఈ పుస్త‌కంలో పాట గురించి ప్రస్తావించారు. అంటే ఈ పల్లె పాట సుమారు 70 ఏండ్ల క్రిత‌మే ఈ పాట జ‌నం నోళ్ల‌లో నానింది.

ఆ పాటలోని సాహిత్యం చూస్తే.. కోమలి పాడిన పాటకు.. సుద్దాల అశోక్ రాసిన లిరిక్స్ కు ఏ మాత్రం పోలిక లేదు.. అయినా తమది కాదని కోసం తమదంటే తమది అని కొట్లాడుకోవడం అందరికీ విడ్డురంగా ఉంది.

Sarangadari Song Lyrics

Also Read: నోటి నుంచి దుర్వాసన వస్తుందా..! నిర్లక్ష్యం వద్దు.. ఇతర సమస్యలకు హెచ్చరిక కావొచ్చు

సామాన్యుల భవిష్యత్ కు భద్రత కల్పించే ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.3 వేలు..