Sanjay Leela Bhansali : ఐశ్వర్య, మాధురి, దీపికా, ప్రియాంక… తాజాగా ఇదే వరుసలో జాయినయ్యారు అలియా. వీళ్లందరినీ మెయిన్ స్ట్రీమ్‌లోకి తీసుకొచ్చిన ఘనత మాత్రం ఆ ఒక్కరికే దక్కుతుంది. ఆయన చెయ్యి పడింది గనుకే వాళ్లందరి జర్నీ ఇక్కడిదాకా వచ్చేసిందిట. ఇంతకీ ఇంతకు ఆయన ఎవరు అని అనుకుంటున్నారా.. స్టార్ డైరెక్టర్ సంజయ్ లీల బన్సాలి. నార్త్ అండ్ సౌత్ ఆడియన్స్‌ని సింగిల్ హ్యాండ్‌తో ఫిదా చేస్తోంది గంగుబాయ్. వేశ్య పాత్రను పిక్ చేసుకోవడమే ఒక సాహసం అనుకుంటే… ఆ పాత్రను సెంట్‌పర్సెంట్ పర్‌ఫెక్ట్‌గా పెర్ఫామ్ చేసి వన్‌అండ్ ఓన్లీ అనిపించుకున్నారు ఆలియా. ఈసారి నేషనల్ అవార్డ్ ఖాయం అనే కాంప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి. గంగూబాయ్ సక్సెస్ క్రెడిట్ కేవలం అలియాకే కాదు ఆమె వెనకున్న భన్సాలీక్కూడా చెందాలి. ఎందుకంటే.. ఆయన జస్ట్ ఒక దర్శకుడు కాదు.. హీరోయిన్ల కర్మాగారం. తన సినిమాలో ఫిమేల్ లీడ్‌కి ఎంపికయ్యారంటే చాలు, వాళ్ల దశ తిరిగినట్టే లెక్క.
భన్సాలీ సినిమా అంటేనే విభిన్నం. పైగా.. ఆయన సినిమాల్లో అందాల దేవతలుగా కనిపిస్తూనే.. కథను డ్రైవ్ చేసే మెయిన్ ఎలిమెంట్‌గా కనిపిస్తారు హీరోయిన్లు. ఆమేరకు వాళ్లను గ్రేస్‌ఫుల్‌గా చూపించడం, ప్రతీ ఫ్రేమ్‌నీ పర్ఫెక్షన్‌తో డిజైన్ చేయడం భన్సాలీ స్పెషాలిటీ. ఐశ్వర్యారాయ్‌తో మొదలుపెడితే, మాధురిదీక్షిత్, రాణీముఖర్జీ, పద్మావత్‌లో దీపికా, భాజీరావ్ మస్తానీలో ప్రియాంక.. ఇప్పుడు గంగూబాయ్‌గా ఆలియా.. ఇలా అందరూ భన్సాలీ సినిమాలతో తమలోని హీరోయిన్ మెటల్‌ని ప్రూవ్ చేసుకున్నవాళ్ళే. ఒక్కసారి భన్సాలీ హీరోయిన్ అనే యూనిక్ ఐడెంటిటీ తెచ్చుకుంటే చాలు.. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఇండివిడ్యువల్‌గా ఎదగడం మొదలుపెడతారు. కెరీర్ గ్రాఫ్ కూడా పరుగు పెట్టేస్తుంది. టోటల్‌గా హీరోయిన్ల విషయంలో బాలీవుడ్ దర్శకేంద్రుడన్న పేరుంది సంజయ్ లీలా భన్సాలీకి. ఇక ఇప్పుడు గంగూభాయ్ సినిమాకూడా హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో మరోసారి తానేంటో నిరూపించుకున్నారు భన్సాలీ.
మరిన్ని ఇక్కడ చదవండి :