Sandeep Reddy Vanga: ఇదెక్కడి ఫ్యానిజం రా మావ..!! మెగాస్టార్‌కు సందీప్ రెడ్డి ఇంత పెద్ద అభిమానా..!

|

Jan 02, 2024 | 12:25 PM

ఇపుడు యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈసినిమా భారీ విజయాన్ని అందుకుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్, బాలీవుడ్ లో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తో సందీప్ రెడ్డి పేరు మారుమ్రోగుతోంది.

Sandeep Reddy Vanga: ఇదెక్కడి ఫ్యానిజం రా మావ..!! మెగాస్టార్‌కు సందీప్ రెడ్డి ఇంత పెద్ద అభిమానా..!
Sandeep Reddy
Follow us on

సందీప్ రెడ్డి వంగ.. ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ గట్టిగా వినిపిస్తుంది. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఆ తర్వాత బాలీవుడ్ లో ఇదే సినిమాను రీమేక్ చేసి పప్పులారీటీ సొంతం చేసుకున్నాడు. అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది ఈసినిమా. ఆ తర్వాత ఇపుడు యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈసినిమా భారీ విజయాన్ని అందుకుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్, బాలీవుడ్ లో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తో సందీప్ రెడ్డి పేరు మారుమ్రోగుతోంది.

తాజాగా సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశాడు. యానిమల్ సినిమా దగ్గర నుంచి వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నాడు సందీప్. తాజాగా ఆయన మాట్లాడుతూ.. తాను మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అని తెలిపారు. అలాగే మాస్టర్ సినిమాలోని ఓ సీన్ గురించి వివరించారు.

చిరంజీవి, సాక్షి శివానంద్ కలిసి నటించిన మాస్టర్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 1997లో రిలీజ్ అయిన ఈ సినిమా గురించి సందీప్ మాట్లాడాడు. మాస్టర్ సినిమాలో చిరంజీవి సాక్షి శివానంద్ తో తన ఫ్లాష్ బ్యాక్ గురించి వివరించే సమయంలో ఆయన వేసుకున్న షర్ట్ కలర్ గురించి కూడా తెలిపారు. ఆ సీన్ లో చిరంజీవి అగ్రసివ్ గా సిగిరెట్ కాల్చే సీన్ అంటే తనకు చాలా ఇష్టం అని తెలిపారు. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సందీప్ రెడ్డి మెగాస్టార్ కు ఎంత పెద్ద ఫ్యానో ఇప్పుడు అర్ధమైంది అంటూ సంబరపడుతున్నారు మెగాస్టార్ ఫ్యాన్స్. చిరు అంటే ఎంత పిచ్చి లేకపోతే ఆయన వేసుకున్న షర్ట్ కలర్ కూడా గుర్తుపెట్టుకున్నారు అంటూ కామెంట్స్  చేస్తున్నారు ఫ్యాన్స్.

సందీప్ రెడ్డి వంగ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

సందీప్ రెడ్డి వంగ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.