
సందీప్ వంగ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యానిమల్’. రష్మిక మందన, రణబీర్ కపూర్ జంటగా తెరకెక్కిన ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇక ఎన్నో అంచనాల ఈ సినిమాను డిసెంబర్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. ఈ ట్రైలర్‌లో రణబీర్ కపూర్, బాబీ డియోల్, రష్మిక నటన ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.
అయితే ఈ క్రమంలోనే నటి రష్మిక చెప్పిన ఓ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హీరో రణ్‌బీర్ కపూర్‌తో మాట్లాడుతూ.. రష్మిక చెప్పిన డైలాగ్ ట్రోలింగ్ కారణమైంది. ట్రైలర్‌లో కొన్ని క్షణాల పాటే రష్మికను చూపించారు. అయితే అదే సమయంలో రష్మిక అస్పష్టంగా చెప్పే డైలాగ్ నెట్టింట చర్చకు దారి తీసింది. అసలు రష్మిక ఏం చెప్పిందో అర్థం కాలేదంటూ కామెంట్స్ పెట్టారు. రష్మిక అసలు ఏ భాష మాట్లాడిందో అర్థం కావడం లేదంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేశారు.
దీంతో నెట్టింట జరిగిన ఈ చర్చపై దర్శకుడు సందీప్ వంగ స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సందీప్ వంగ స్పష్టతనిచ్చారు. ఈ విషయమై సందీప్ వంగ మాట్లాడుతూ.. ‘ఈ సన్నివేశానికి ఇంత స్పందన వస్తుందని ముందే ఊహించాను. చాలా ఎమోషనల్ సీన్ కావడంతో ఆ సీన్ లో రష్మిక చాలా డిఫరెంట్ గా మాట్లాడాల్సి వచ్చింది. ఒక వ్యక్తి అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, అతను తన పళ్లతో మాట్లాడుతాడు (పళ్లు కొరుకుతారు). ఇది కేవలం ట్రైలర్ కాబట్టి, మీకు సందర్భం అర్థం కాలేదు. కానీ సినిమా మొత్తం చూస్తే.. మీకు దీని వెనకున్న అర్థం మీకు కచ్చితంగా తెలుస్తుంది’ అని చెప్పుకొచ్చారు.
మరి సందీప్ వంగ ఇచ్చిన క్లారిటీతో అయినా నెట్టింట జరుగుతోన్న ట్రోలింగ్‌కు తెరపడుతుందేమో చూడాలి. ఇదిలా ఉంటే భారీ అంచనాల నడుమ విడుదలవుతోన్న ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో విడుదలవుతోన్న యానిమల్ మూవీ తొలి రోజు ఏకంగా రూ. 50 కోట్లు వసూలు చేయనున్నట్లు అంచనా వేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..