Samyuktha Menon: క్రేజీ ఆఫర్ అందుకున్న సంయుక్త మీనన్ ఆ కుర్ర హీరో సినిమాలో ఛాన్స్

పవర్ స్టార్, రానా కలిసి నటించిన ఈ సినిమా మంచి హిట్ సాధించింది. ఈ మూవీలో రానాకు జోడీగా నటించింది. ఆతర్వాత కళ్యాణ్ రానాకు జోడీగా బింబిసార సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ వెంటనే ధనుష్ తో జోడీగా నటించే ఛాన్స్ అందుకుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ అనే సినిమాలో చేసింది సంయుక్త ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న సంయుక్త అంతటితో ఆగలేదు.

Samyuktha Menon: క్రేజీ ఆఫర్ అందుకున్న సంయుక్త మీనన్ ఆ కుర్ర హీరో సినిమాలో ఛాన్స్
Samyuktha Menon

Updated on: Aug 15, 2023 | 8:34 AM

సినిమా ఇండస్ట్రీలో టాలెంట్‌ తో దూసుకుపోతున్న హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాతో పరిచయం అయ్యింది. పవర్ స్టార్, రానా కలిసి నటించిన ఈ సినిమా మంచి హిట్ సాధించింది. ఈ మూవీలో రానాకు జోడీగా నటించింది. ఆతర్వాత కళ్యాణ్ రానాకు జోడీగా బింబిసార సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ వెంటనే ధనుష్ తో జోడీగా నటించే ఛాన్స్ అందుకుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ అనే సినిమాలో చేసింది సంయుక్త ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న సంయుక్త అంతటితో ఆగలేదు. యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమాతో మరో హిట్ కొట్టింది.

విరూపాక్ష సినిమాలో తన నటనతో అందరిని కట్టిపడేసింది సంయుక్త . అయితే విరూపాక్ష సినిమా తర్వాత సంయుక్తమీనన్ సైలెంట్ అయ్యింది. మొన్నీమధ్య మహేష్ బాబు సినిమాలో నటిస్తుందని వార్తలు వచ్చాయి.కానీ ఆమె ప్లేస్ లోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ ఇచ్చింది.

ప్రస్తుతం సంయుక్త మీనన్ సినిమాలు అనౌన్స్ చేయడంలేదు. సంయక్త సైలెంట్ అవ్వడానికి కారణం ఏంటా.? అని ఆలోచిస్తున్నారు అభిమానులు. అయితే వరుస విజయాలను అందుకున్న సంయుక్త తన నెక్స్ట్ సినిమాల విషయంలో మరింత జాగ్రత్త పడుతుందని అందుకే గ్యాప్ తీసుకుంటుంటుందని అంటున్నారు కొందరు. అయితే తాజాగా ఈ అమ్మడు ఓ క్రేజీ ఆఫర్ అందుకుంది తెలుస్తోంది. నిఖిల్ సరసన నటిస్తుందట సంయుక్త. నిఖిల్ చేస్తున్న పిరియాడికల్ డ్రామా చేస్తున్న విషయం తెలిసిందే.

సంయుక్త మీనన్ తెలుగుతో పాటు తమిళ్ లోనూ అవకాశాలు అందుకుంటుంది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.