అందాల భామ సంయుక్త మీనన్(Samyuktha Menon) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ చిన్నది. భీమ్లానాయక్ సినిమా రానా భార్య పాత్రలో నటించి మెప్పించింది సంయుక్త. అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ సినిమా హిట్ అవ్వడంతో సంయుక్తకు వరుస ఆఫర్లు క్యూకడుతున్నాయి చిన్నదానికి.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న సార్ సినిమాలో చేస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తో ధనుష్ తెలుగులో స్ట్రైట్ గా సినిమా చేస్తున్నాడు. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న బింబిసార సినిమాలో నటిస్తుంది సంయుక్త. ఈ హిస్టారికల్ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే సంయుక్త మీనన్ కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది..
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో సంయుక్త కు అవకాశం దక్కిందని గత కొద్దిరోజులుగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నవిషయం తెలిసిందే. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మూడో సినిమా ఇది. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమా పూజాహెగ్డే తో పాటు మరో హీరోయిన్ గా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోందని టాక్ వినిపిస్తోంది. ఈ వార్తల పై సంయుక్త మీనన్ స్పందించింది. మహేష్ సినిమాలో నటించడం లేదని క్లారిటీ ఇచ్చింది ఈ బ్యూటీ. `మహేష్-త్రివిక్రమ్ సినిమాలో నేను ఉన్నాను అన్నది స్వీట్ రూమర్ అంటూ కొట్టిపడేసింది సంయుక్త.