
టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ అందాల ముద్దుగుమ్మ.. ఈ చిన్నది చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. తన నటనతో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అందాల తార. నటనలోనే కాదు గ్లామర్ పరంగానూ కుర్రాళ్లను కవ్వించింది. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న ఈ కుర్రది. యంగ్ హీరోల సరసనే కాదు సీరియర్ హీరోలతోనూ జత కడుతుంది. తాజాగా ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తనకు ఓ స్టార్ హీరో తెగ నచ్చేశాడని అతనితో మరోసారి కలిసి నటించాలని ఉందని చెప్పుకొచ్చింది. ఆ అమ్మడు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకూ ఆ అమ్మడు ఎవరో తెలుసా.?
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న హీరోయిన్ ఎవరో కాదు.. ముద్దుగుమ్మ సంయక్తమీనన్. ఈ క్రేజీ బ్యూటీ ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా గడుపుతుంది. వరుసగా సినిమాల్లో ఛాన్స్ లు అందుకంటున్న ఈ చిన్నది సక్సెస్ లు కూడా వరుసగా అందుకుంటుంది. బీమ్లానాయక్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రది.. వరుసగా సినిమాలు చేస్తుంది. చివరిగా నారి నారి నడుమ మురారి సినిమాతో హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు స్వయంభు సినిమాతో ఆకట్టుకోవడానికి రెడీ అవుతుంది.
ఇదిలా ఉంటే తనకు ఓ స్టార్ హీరో అంటే ఇష్టమని అతనితో కలిసి మరోసారి నటించాలని ఉంది అని తెలిపింది. అతను ఎవరో కాదు తమిళ్ స్టార్ హీరో ధనుష్. ధనుష్ తో కలిసి సార్ సినిమాలో నటించింది సంయుక్త ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తమిళ్, తెలుగు భాషల్లో విడుదలై అలరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంయుక్త మాట్లాడుతూ.. ధనుష్ తో కలిసి నటించడం ఒక పాఠంలాంటిది. ఆయన సెట్ లో చాలా తక్కువ మాట్లాడతారు.. కానీ కెమెరా ముందు రాగానే సర్వసం ఇచ్చేస్తారు. డైరెక్టర్ యాక్షన్ అనగానే ఆయనకు ఓ పవర్ వచ్చేస్తుంది. ధనుష్ నుంచి చాలా నేర్చుకున్నా.. ధనుష్ సినిమా చేస్తున్నాడు అంటే అందులో ఎదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయనతో కలిసి మరోసారి నటించాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది సంయుక్త. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.