సమంత ప్రస్తుతం ఖుషి చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో విజయ్ దేవరకొండ, సామ్ జంటగా నటిస్తున్నారు. ఇదే కాకుండా.. ఇప్పటికే సామ్ నటించిన యశోద, శాకుంతలం చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. త్వరలోనే ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇటీవల విడుదలైన యశోద టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీలో సామ్ గర్భిణిగా కనిపించనుంది. ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో నవంబర్ 11న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ.. యశోద నుంచి సరికొత్త పోస్టర్ షేర్ చేసింది చిత్రయూనిట్.
కొత్త పోస్టర్ లో సమంత గాయాలతో కనిపించగా.. వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా ”యశోద కొత్త కాలం నాటి యాక్షన్ థ్రిల్లర్. మా సినిమా మిస్టరీ, ఎమోషన్స్‌తో కూడిన బ్యాలెన్స్‌డ్ కోటీన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ఎలిమెంట్స్‌తో ఉంటుంది. ఇదొక ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్. . టైటిల్ రోల్ ప్లే చేస్తూ, సమంత తన యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించింది. ఆమె తెలుగు , తమిళం రెండింటిలోనూ తనే డబ్బింగ్ చెప్పుకుంది.
భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను 100 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసాము. యశోదను చూసేందుకు నవంబర్ 11, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లకు వెళ్లండి ” అంటూ చెప్పుకొచ్చారు.
Make way for #Yashoda in theatres on Nov 11th 2022?
Releasing Worldwide in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi#YashodaTheMovie @Samanthaprabhu2 @varusarath5 @Iamunnimukundan @harishankaroffi @hareeshnarayan #Manisharma @krishnasivalenk @SrideviMovieOff pic.twitter.com/YgXeFh9i6i
— Sridevi Movies (@SrideviMovieOff) October 17, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.