Samantha Yashoda: రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోన్న యశోద.. సమంత సినిమాకు ఊహించని బజ్

కెరీర్ మంచి స్పీడ్ లో ఉన్నప్పుడే అక్కినేని నాగచైతన్యను పెళ్లాడింది ఈ చిన్నది. ఆ తర్వాత ఏ ఇద్దరుమనస్స్పర్ధల కారణంగా విడిపోయారు. ఇక ఇప్పుడు పూర్తిగా సినిమాల పైనే దృష్టి పెట్టింది ఈ చిన్నది. తెలుగు తమిళ్ తో పటు హిందీ లోనూ సినిమాలు చేస్తోంది సమంత.

Samantha Yashoda: రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోన్న యశోద.. సమంత సినిమాకు ఊహించని బజ్
Yashoda

Updated on: Oct 19, 2022 | 1:06 PM

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున చెప్పేరు పేరు సమంత. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది సమంత. ఏమాయ చేశావే సినిమానుంచి ఇప్పటివరకు ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతోంది. కెరీర్ మంచి స్పీడ్ లో ఉన్నప్పుడే అక్కినేని నాగచైతన్యను పెళ్లాడింది ఈ చిన్నది. ఆ తర్వాత ఇద్దరు మనస్స్పర్ధల కారణంగా విడిపోయారు. ఇక ఇప్పుడు పూర్తిగా సినిమాల పైనే దృష్టి పెట్టింది ఈ చిన్నది. తెలుగు, తమిళ్ తో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తోంది సమంత. ప్రస్తుతం సమంత నటిస్తోన్న సినిమాల్లో యశోద ఒకటి. లేడీ ఓరియెంటెడ్ కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. ఈ చిత్రాన్ని శ్రీదేవీ మూవీస్ బ్యానర్ మీద శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోండగా.. హరి–హరీష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. గ్లిమ్ప్స్ తో సినిమాలో ఏదో ఇంట్రెస్టింగ్ లైన్ ఉందని అందరిలోనూ అనిపించేలా ఆసక్తిని పెంచేశారు. దాంతో సమంత యశోద సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అయింది. అలాగే ఈ సినిమా నుంచి మొన్నామధ్య వచ్చిన టీజర్ కూడా మరింత బజ్ ను క్రియేట్ చేసింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కు ముందే రికార్డులు తిరగరాస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రీరిలీజ్ బిజినెస్ తో సరికొత్త రికార్డును క్రియేట్ చేసిందట సమంత యశోద. రిలీజ్ కు ముందే యశోద నిర్మాతలకు ఏకంగా 8 కోట్ల రూపాయల లాభం వచ్చిందని టాక్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో తెగ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకు టీజర్ తర్వాతి పాజిటివిటీ పెరిగింది. దాంతో ప్రీరిలీజ్ బిజినెస్ బాగా జరిగిందని తెలుస్తోంది.

లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సమంత గర్భిణిగా కనిపించనున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. యశోద మూవీ ఈ ఏడాది నవంబర్ నెల 11వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి