డ్రగ్స్​ కేసు : రకుల్​కు బాసటగా సమంత​

|

Sep 13, 2020 | 10:30 PM

బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహార కలకలం రేపుతోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో రియా చక్రవర్తి  పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు చెప్పినట్లు వార్తలు సర్కులేట్  అవుతున్నాయి.

డ్రగ్స్​ కేసు : రకుల్​కు బాసటగా సమంత​
Follow us on

బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో రియా చక్రవర్తి  పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు చెప్పినట్లు వార్తలు సర్కులేట్  అవుతున్నాయి. అందులో ముఖ్యంగా రకుల్​ ప్రీత్​ సింగ్, సారా అలీఖాన్​​ పేర్లు వినిపిస్తున్నాయి. దీంతో ఇండస్ట్రీలో  ఒక్కసారిగా కలకలం రేగింది. నెటిజన్లు కూడా వారిపై ట్రోల్స్ వేస్తున్నారు.

అయితే తాజాగా దీనిపై స్పందించిన అగ్ర కథానాయిక ​ సమంత.. రకుల్, సారా​కు బాసటగా నిలిచింది. ఈ మేరకు తన ఇన్​స్టా స్టోరీస్​లో​ ఓ ఫొటోను పోస్ట్​ చేసింది. అంతకుముందే ఎన్​సీబీ డిప్యూటీ డైరెక్టర్​ కేపీఎస్​ మల్హోత్రా.. తాము డ్రగ్స్ కేసు​కు సంబంధించి బాలీవుడ్​కు చెందిన ప్రముఖుల పేర్ల జాబితాను తయారు చేయలేదని చెప్పారు. ఈ విషయాన్నే సామ్​ పోస్ట్ చేసింది. దీంతో తాజాగా నెటిజన్లు కూడా సారీ రకుల్​, సారా అంటూ మళ్లీ ట్రెండింగ్​ చేయడం స్టార్ట్ చేశారు.

Also Read :

దొంగతనానికి వచ్చి, గురకపెట్టి నిద్రపోయాడు